Akbaruddin Owaisi: మెట్రో రైలు ఎండీని కలిసిన అక్బరుద్దీన్.. ఓల్డ్ సిటీ లైన్ త్వరగా పూర్తి చేయాలని వినతి

ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నామా వరకు నిర్మించే మెట్రో రైల్ కారిడార్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు ఏఐఎమ్ఐఎమ్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ. ఈ ప్రాజెక్టు ఆలస్యంపై ఆయన మెట్రో రైల్ ఎండీతో చర్చించారు.

Akbaruddin Owaisi: మెట్రో రైలు ఎండీని కలిసిన అక్బరుద్దీన్.. ఓల్డ్ సిటీ లైన్ త్వరగా పూర్తి చేయాలని వినతి

Updated On : October 12, 2022 / 6:11 PM IST

Akbaruddin Owaisi: హైదరాబాద్, ఓల్డ్ సిటీలో నిర్మించనున్న మెట్రో రైలును త్వరగా పూర్తి చేసి, అందుబాటులోకి తేవాలని మెట్రో రైల్ ఎండీని కోరారు ఏఐఎమ్ఐఎమ్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని అక్బరుద్దీన్ బుధవారం కలిశారు.

Leopard Cub: ఫిలిం సిటీలో చిరుత పిల్ల.. తరిమిన కుక్కలు.. పట్టుకుని అధికారులకు అప్పగించిన గార్డ్స్

ప్రభుత్వం ప్రతిపాదించిన ఇమ్లిబన్ బస్ స్టేషన్-ఫలక్‌నామా లైన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీని కోసం రూ.500 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నామా వరకు నిర్మించే మెట్రో రైల్ కారిడార్ పొడవు 5.5 కిలోమీటర్లు. దీన్ని 2022-23 కల్లా పూర్తి చేయాల్సి ఉంది. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించినట్లు అక్బరుద్దీన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఒక కాల పరిమితి నిర్ణయించాలి అని కోరినట్లు అక్బరుద్దీన్ గుర్తు చేశారు.

Chinese Visas: భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రెండేళ్ల తర్వాత భారతీయ విద్యార్థులకు చైనా వీసా

‘‘ఓల్డ్ సిటీలో మెట్రో రైలు నిర్మాణం పూర్తి చేయాలని ఎప్పట్నుంచో కోరుతున్నాం. కానీ, పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. బడ్జెట్లో నిధులు కేటాయించిన తర్వాత కూడా పనులు మొదలు కాకపోవడం ఆశ్చర్యంగా ఉంది’’ అని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. అయితే, ఫలక్‌నామా కారిడార్లో ప్రాజెక్టు ఆలస్యం కావడానికి గల కారణాలను మెట్రో రైల్ ఎండీ అక్బరుద్దీన్‌కు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే ప్రాంతానికి సంబంధించి అనుమతులు పూర్తి స్థాయిలో రాకపోవడం వల్లే ప్రాజెక్టులో జాప్యం జరుగుతోందని చెప్పారు. ఈ రూట్లో అనేక మతపరమైన స్థలాలు ఉండటం, దానివల్ల అనుమతులు రాకపోవడం కూడా ఆలస్యానికి కారణమని చెప్పారు.