SBI Chairman: లోన్ ఇవ్వకపోయావో చంపేస్తాం.. ఎస్బీఐ ఛైర్మన్‌కు బెదిరింపులు.. హెడ్ క్వార్టర్స్ పేల్చివేస్తామంటూ ఫోన్
లోన్ కోసం ఏకంగా ఎస్బీఐ ఛైర్మన్‌కే కాల్ చేసి బెదిరించాడో దుండగుడు. తను కోరినట్లుగా లోన్ ఇవ్వకుంటే కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరించాడు. అంతేకాదు ఎస్బీఐ ప్రధాన కార్యాలయాన్ని పేల్చేస్తానని చెప్పాడు.

SBI Chairman: తన డిమాండ్లు నెరవేర్చకుంటే ఎస్బీఐ ఛైర్మన్ డి.కె.ఖారాను కిడ్నాప్ చేసి చంపడంతోపాటు, ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్‌ను పేలుస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనికి సంబంధించి ఖారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Boora Narsaiah Goud: టీఆర్ఎస్‌కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా.. బీజేపీలో చేరే అవకాశం?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహమ్మద్ జియాల్ అనే వ్యక్తి నుంచి ఖారాకు ఒక కాల్ వచ్చింది. తను పాకిస్తాన్ నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పాడు. తను కోరుకున్నట్లుగా, కావాల్సిన వారికి వారం రోజుల్లోగా పది లక్షల రూపాయల లోన్ మంజూరు చేయాలని, లేకుంటే తనను కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరించాడు. అలాగే ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ బిల్డింగును పేల్చివేస్తామని కూడా బెదిరించాడు. ఈ బిల్డింగ్ మహారాష్ట్ర అసెంబ్లీ భవనం పక్కన ఉండటం విశేషం. దీనిపై ఖారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ అంశంపై దర్యాప్తు జరుపుతున్నారు.
Oil Prices: పండుగల వేళ నూనెలకు పెరిగిన డిమాండ్.. ఆకాశాన్నంటుతున్న ధరలు
కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశంపై విచారణ జరుపుతున్నారు. అయితే, నిందితుడు చెప్పినట్లుగా ఈ కాల్ పాకిస్తాన్ నుంచి రాలేదని, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.