GN Saibaba: సాయిబాబా విడుదలపై సుప్రీంకోర్టుకు ఎన్ఐఏ.. విడుదల ఆపివేయాలని కోరుతూ పిటిషన్

మావోయిస్టులతో సంబంధాల విషయంలో అరెస్టైన మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్ఐఏ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆయన విడుదలపై స్టే విధించాలని కోరింది.

GN Saibaba: సాయిబాబా విడుదలపై సుప్రీంకోర్టుకు ఎన్ఐఏ.. విడుదల ఆపివేయాలని కోరుతూ పిటిషన్

Updated On : October 14, 2022 / 5:52 PM IST

GN Saibaba: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చడం పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎన్ఐఏ. జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేయడాన్ని నిలిపివేయాలని, హై కోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని కోరుతూ ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Parathas: పరాటాలపై 18 శాతం జీఎస్టీ.. బ్రిటీష్ వాళ్లు కూడా పన్ను వేయలేదన్న కేజ్రీవాల్

మావోయిస్టులతో సంబంధాల విషయంలో సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ, బాంబే హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఆయనను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయాన్ని ఎన్ఐఏ వ్యతిరేకిస్తోంది. సాయిబాబా దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, సాయిబాబాను విడుదల చేయడాన్ని ఆపలేమని ఎన్ఐఏ అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. సీజేఐ అందుబాటులో లేనందున వెంటనే ఈ అంశాన్ని లిస్ట్ చేయాలి జస్టిస్ చంద్రచూడ్ ముందు సొలిసిటరీ జనరల్ ప్రస్తావించారు.

Traffic Police: బండి ఆపలేదని యువకుల్ని తోసేసి బైక్ పైనుంచి కింద పడేసిన కానిస్టేబుల్.. వీడియో వైరల్

ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. సీజేఐ ఆదేశాలకు లోబడి లిస్టింగ్ ఉంటుందని జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం తెలపింది. సాయిబాబా కేసు అంశాన్ని రిజిస్ట్రార్ ముందు ప్రస్తావించానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్వేచ్ఛ ఇచ్చింది.