Advise To Indians: యుక్రెయిన్ సంక్షోభం.. భారతీయులకు కేంద్రం కీలక ఆదేశాలు

యుక్రెయిన్‌లో ఉంటున్న భారతీయుల గురించి... యుక్రెయిన్‌ రావాలనుకుంటున్న భారతీయుల గురించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది.

Advise To Indians: యుక్రెయిన్ సంక్షోభం.. భారతీయులకు కేంద్రం కీలక ఆదేశాలు

Updated On : October 19, 2022 / 9:35 PM IST

Advise To Indians: యుక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే. యుక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. మరోవైపు అణ్వస్త్రాల ప్రయోగంపైనా పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో యుక్రెయిన్ ఇప్పుడు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం భారతీయులకు తాజా ఆదేశాలు జారీ చేసింది.

Mukesh Ambani: దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లా కొనుగోలు చేసిన ముకేష్ అంబానీ.. ధర ఎంతో తెలుసా!

యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం కీలక ఉత్తర్వు విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో భారతీయులు ఎవరూ యుక్రెయిన్ రాకూడదని ఆదేశించింది. అలాగే యుక్రెయిన్‌లో ఉంటున్న విద్యార్థులతోసహా భారతీయులంతా వీలున్నంత త్వరగా ఆ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. యుక్రెయిన్ రావాలనుకుంటున్న భారతీయులు తమ ప్రయణాన్ని రద్దు చేసుకోవాలని సూచించింది. మరోవైపు యుక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల్లో సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో అక్కడి ప్రజలు క్షణక్షణం అత్యంత భయానక పరిస్థితుల మధ్య ప్రాణాలు అరచేతపట్టుకుని బతకాల్సి వస్తుంది.