TG PGECET 2026 Results : గుడ్ న్యూస్.. టీజీ పీజీఈసెట్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. మీ ర్యాంకు కార్డు డౌన్లోడ్ ఇలా..
TG PGECET 2026 Results : టీజీపీజీఈసెట్ ఫలితాలు వచ్చేశాయి. ర్యాంకు కార్డు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా? ఈ డైరెక్ట్ లింక్ క్లిక్ చేసి ఫలితాలను చెక్ చేసుకోండి.
TG PGECET 2026 Results
TG PGECET 2026 Results : విద్యార్థులకు గుడ్ న్యూస్.. టీజీ పీజీఈసెట్-2026 ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE), జేఎన్టీయూహెచ్ సంయుక్తంగా తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PGECET) 2026 ఫలితాలను జూన్ 5న (శుక్రవారం) విడుదల చేశాయి.
పీజీసెట్ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ వివరాలతో అధికారిక రిజల్ట్స్ పోర్టల్ (pgecet.tgche.ac.in) ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే, ర్యాంక్ కార్డులను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా యూనివర్శిటీలు, అనుబంధ కాలేజీలు అందించే ఎం.టెక్, ఎంఈ, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్, ఫార్మ్.డి (పోస్ట్ బాకలారియేట్) వంటి వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సులలో 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ కోసం టీజీ పీజీఈసెట్ (TG PGECET) నిర్వహిస్తారు.
Read Also : Samsung Galaxy A36 5G : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు!
ఇందులో భాగంగా ఈ పీజీఈసెట్ పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) 2026 మే 28 నుంచి 31 వరకు నిర్వహించింది.
రాబోయే రోజుల్లో కౌన్సెలింగ్ షెడ్యూళ్లు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ, సీట్ల కేటాయింపు విధానాలు, అడ్మిషన్లకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులలో పేర్కొన్న వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఫ్యూజర్ రిఫరెన్స్ కోసం అడ్మిషన్, కౌన్సెలింగ్ బెనిఫిట్స్ కోసం అన్ని సర్టిఫికేట్లను రెడీగా పెట్టుకోండి.
టీజీ PGECET 2026 ర్యాంక్ కార్డ్‌ను ఎలా డౌన్లోడ్ చేయాలి? :
- ముందుగా (pgecet.tgche.ac.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- ‘TG PGECET 2026 Results’ లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేయండి.
- మీ పూర్తి డేటాను సమర్పించండి.
- మీ రిజల్ట్స్, ర్యాంక్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసి ఫ్రింట్ తీసుకోండి.
