Kodali Nani: కొడాలి నాని వారసుడు ఇతనే..! ఎంట్రీ కన్ ఫాం..
Kodali Nani Political Successor: కొడాలి నాని వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా తెలుగు స్టేట్స్లో పరిచయం అక్కర్లేని పేరు. కట్ చేస్తే కొడాలి రాజకీయ వారసుడి ఎంట్రీపై మాజీమంత్రి పేర్నినాని కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.
Kodali Nani Brothers Son Arjun Rao Political Entry
Kodali Nani: కొడాలి నాని వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా తెలుగు స్టేట్స్లో పరిచయం అక్కర్లేని పేరు. అలాంటి కొడాలి నాని రాజకీయ అడుగులపై రెండేళ్లుగా ఒక్కటే డిస్కషన్ జరుగుతోంది. అయితే ఇన్నాళ్లు కేసులు, అనారోగ్య సమస్యలతో పొలిటికల్ పిచ్‌కు దూరంగా ఉంటూ వచ్చిన కొడాలి నాని ఈ మధ్యే కాస్త యాక్టివ్ అవుతున్నారు. దీంతో కొడాలి నెక్స్ట్ ఎలక్షన్స్‌కు రెడీ అవుతున్నారన్న ప్రచారం జరిగింది. కట్ చేస్తే కొడాలి రాజకీయ వారసుడి ఎంట్రీపై మాజీమంత్రి పేర్నినాని కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. దీంతో కొడాలి నాని రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారా.? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. కొడాలి వారసుడు వచ్చేస్తున్నాడంటూ వైసీపీకే చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని ప్రకటించడం విస్తృత చర్చకు దారితీసింది.
మాజీ మంత్రి కొడాలి వారసుడు అంటూ ఆయన తమ్ముడు కొడుకు కొడాలి అర్జున్‌రావు పేరును మాజీ మంత్రి పేర్నినాని ప్రకటించారు. 2034 ఎన్నికల్లో కొడాలి స్థానంలో గుడివాడ వైసీపీ అభ్యర్థిగా అర్జున్ రావు పోటీ చేస్తారని అనౌన్స్ చేశారు. గుడివాడ వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని సమక్షంలోనే పేర్ని నాని ఈ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. నాలుగు రోజుల క్రితం గుడివాడలో జరిగిన వైసీపీ సమావేశానికి పార్టీ నేతలతో పాటు అర్జున్ హాజరయ్యారు. నియోజకవర్గంలో సీనియర్ నేతలతో పాటు స్టేజిపై కూర్చున్నారు. అయితే అర్జున్‌రావు పోటీ చేసేది ఇప్పుడు కాదు 2034 ఎన్నికల్లో అంటూ సభలో ప్రకటన వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. దీంతో ఇప్పుడు కొడాలి వారసుడు టాపిక్ చర్చనీయాంశంగా మారింది. అంటే 2029 ఎన్నికల్లో కొడాలి నాని మళ్లీ పోటీ చేస్తారని చెప్పకనే చెప్పారన్న చర్చ జరుగుతోంది.
Also Read: వైసీపీలో వార్.. ఆ టికెట్ కోసమేనా?
మాజీ మంత్రి కొడాలి నానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన కూతుర్లలో ఎవరికీ పాలిటిక్స్‌పై పెద్దగా ఆసక్తి లేదని.. తన తమ్ముడి కొడుకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఒకటి రెండుసార్లు చెప్పుకొచ్చారు కొడాలి నాని. గత ఎన్నికల్లో పోటీ, ప్రచారం సమయంలోనే తన రాజకీయ వారసత్వం కొంత స్పష్టత ఇచ్చారు కొడాలి నాని. 2024 ఎన్నికలే తనకు చివరివి అంటూ గుడివాడలో ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు కొడాలి నాని. అయితే గుడివాడతో పాటు రాష్ట్రంలోనూ పార్టీ ఓటమి పాలవ్వడంతో ఈసారి అంటే 2029లో కొడాలి పోటీ చేయడం తప్పని పరిస్థితి. గుడివాడలో ఇప్పటివరకు 5 సార్లు పోటీ వేసిన కొడాలి నాలుగుసార్లు గెలిచారు. 2024లో ఓడిపోయారు. రెండు సార్లు టీడీపీ నుంచి పోటీ చేస్తే మూడుసార్లు వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇక ఆరోసారి 2029లో పోటీకి సిద్ధం అవుతున్నారు. అయితే తన రాజకీయ వారసుడు ఎంట్రీ ప్రకటన చేసినా..ఈసారి మాత్రం కొడాలి బరిలో ఉండబోతున్నారనే క్లారిటీ వచ్చేసింది. ఒక పక్క కొడాలి నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరగడం, పోటీపై అనుమానాలు తొలగడంతో వైసీపీ క్యాడర్ జోష్ లోకి వచ్చింది.
యూత్‌లో మంచి ఫాలోయింగ్, కొడాలి మాదిరిగానే దూకుడు ఉండటంతో..అర్జున్‌రావు ఎంట్రీకి వైసీపీ పెద్దలు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు టాక్. మరోవైపు మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని తన కుమారుడు కిట్టూ ఇప్పటికే నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లో కిట్టూనే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు గుడివాడకు కూడా కొత్త వారసుడిని పరిచయం చేయడం చూస్తే మాజీ మంత్రి పేర్ని వ్యూహాత్మకంగానే వ్యవహరించారని అంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు హోదాలో ఉన్న పేర్నినాని గుడివాడ నియోజకవర్గంలో యువతను ఆకట్టుకోడానికి పార్టీ, క్యాడర్లో జోష్ నింపడానికి ఈ ప్రకటన చేశారని అంటున్నారు. యువతకు అవకాశాలు ఇస్తామన్న సంకేతాలు పంపడానికే..8 ఏళ్ల ముందుగానే 2034 ఎన్నికలపై ప్రకటన చేశారని చర్చించుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు. మొత్తానికి గుడివాడలో కొడాలి నాని వారసులు ఇంట్రీ ఖరారు అయిపోయింది. ఇంకా ఆయన చదువు పూర్తికాకపోవడంతో..రాబోయే ఎన్నికల్లో కొడాలి నానినే క్యాండిడేట్‌గా ఉంటారని చెబుతున్నారు. అర్జున్ మరి కొన్ని రోజుల్లో గుడివాడలో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతారని తెలుస్తుంది.
