Swamy Goud: కమలానికి షాక్.. బీజేపీకి మరో నేత గుడ్‌బై.. టీఆర్ఎస్‌లో చేరనున్న స్వామి గౌడ్!

బీజేపీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. సీనియర్ నేత స్వామి గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే రాజీనామా చేసిన దాసోజ్ శ్రవణ్‌తో కలిసి స్వామి గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.

Swamy Goud: కమలానికి షాక్.. బీజేపీకి మరో నేత గుడ్‌బై.. టీఆర్ఎస్‌లో చేరనున్న స్వామి గౌడ్!

Updated On : October 21, 2022 / 3:42 PM IST

Swamy Goud: మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న దాసోజు శ్రవణ్ బీజేపీకి రాజీనామా చేయగా, తాజాగా మరో నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన నేతల్లో ఒకరైన స్వామి గౌడ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు.

Dasoju Sravan: బీజేపీకి దాసోజు శ్రవణ్ రాజీనామా.. నేడు టీఆర్‌ఎస్‌లో చేరనున్న నేత

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆయన తన రాజీనామా లేఖను పంపారు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. ఇక.. స్వామి గౌడ్ బండి సంజయ్‌కు రాసిన లేఖలో అనేక అంశాల్ని ప్రస్తావించారు. ‘‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ గుర్తించడం లేదు. పార్టీలో ధనవంతులు, బడా కాంట్రాక్టర్లకు ప్రాతినిధ్యం పెంచుతున్నారు. నిబద్ధతతో, నిజాయితీతో పని చేస్తున్న బలహీనవర్గాల కార్యకర్తలపై మీ వైఖరి ఆక్షేపనీయం. నాలాంటి వారు పార్టీలో ఎన్నో అవమానాలకు గురవుతున్నారు. పార్టీలో అవమానాలు భరిస్తూ కొనసాగలేకపోతున్నాను.

Siddhu Jonnalagadda : నాని ఆ సినిమా సరిగ్గా తీయలేదు.. అన్‌స్టాపబుల్ షోలో సంచలన వ్యాఖ్యలు చేసిన డీజే టిల్లు..

కలత చెందిన మనస్సుతో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. పార్టీలో ఇంతకాలం మీరందించిన సహకారానికి ధన్యవాదాలు’’ అంటూ స్వామిగౌడ్ తన లేఖలో పేర్కొన్నారు. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు కీలక నేతలు బీజేపీకి గుడ్‌బై చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో సంచనలంగా మారింది. కాగా, దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్.. ఇద్దరూ టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉంది.