Varun Gandhi: ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వని స్కూల్ యాజమాన్యం.. ఏడ్చిన బాలిక.. బీజేపీ ఎంపీ స్పందన ఇదే

స్కూలు ఫీజు కట్టలేదని ఒక చిన్నారిని పరీక్షకు అనుమతించలేదు ప్రైవేటు స్కూలు యాజమాన్యం. దీంతో ఆ చిన్నారి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సంఘటనను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.

Varun Gandhi: ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వని స్కూల్ యాజమాన్యం.. ఏడ్చిన బాలిక.. బీజేపీ ఎంపీ స్పందన ఇదే

Updated On : October 18, 2022 / 9:03 PM IST

Varun Gandhi: స్కూలు, కాలేజీల్లో ఫీజులు చెల్లించకుంటే పరీక్ష రాయనివ్వకపోవడం, కొన్నిసార్లు క్లాసులకు అనుమతించకపోవడం జరుగుతుంటుంది. ఇది చాలా మామూలు విషయమే అని చూసి వదిలేస్తుంటారు చాలా మంది.

Woman Bank Manager: బ్యాంకు దోపిడీకి కత్తితో వచ్చిన దుండగుడు.. మహిళా మేనేజర్ ఎలా పోరాడిందో చూడండి.. వైరల్ వీడియో

కానీ, బీజేపీ ఎంపీ మాత్రం ఈ అంశంపై స్పందించారు. ఉత్తర ప్రదేశ్, ఫిల్బిత్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికైన వరుణ్ గాంధీ దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రకారం.. ఉత్తర ప్రదేశ్, ఉన్నావ్ జిల్లాకు చెందిన ఒక చిన్నారి స్థానిక ప్రైవేటు స్కూల్లో చదువుతోంది. అయితే, ఆ చిన్నారి స్కూలు ఫీజు చెల్లించలేదని పరీక్షకు అనుమతించలేదు. దీంతో తనను స్కూల్ ఫీజు కట్టనందుకు పరీక్ష రాయనివ్వలేదని ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చింది. దీనికి సంబంధించిన వీడియోనే వరుణ్ గాంధీ షేర్ చేశారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Family Burnt Alive: భార్య కాపురానికి రావడం లేదని దారుణం.. అత్తారింటికి వెళ్లి భార్య, పిల్లలుసహా ఐదుగురి సజీవ దహనం

‘‘దేశంలో ఫీజులు చెల్లించలేక వివక్షకు గురవుతున్న లక్షలాది మంది విద్యార్థుల బాధకి ఈ చిన్నారి కన్నీళ్లు నిదర్శనం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్నారులు విద్యకు దూరమవ్వకుండా చూడటం అధికారులతోపాటు, సమాంజలోని ప్రతి ఒక్కరి బాధ్యత. జిల్లా అధికారులు ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలి’’ అని వరుణ్ గాంధీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.