Family Burnt Alive: భార్య కాపురానికి రావడం లేదని దారుణం.. అత్తారింటికి వెళ్లి భార్య, పిల్లలుసహా ఐదుగురి సజీవ దహనం

భార్య కాపురానికి రావడం లేదని ఆమెతోపాటు, ఇద్దరు పిల్లలు, అత్తామామలు.. మొత్తం ఐదుగురిని సజీవ దహనం చేశాడో దుర్మార్గుడు. అత్తారింటికి వెళ్లి, అక్కడ నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Family Burnt Alive: భార్య కాపురానికి రావడం లేదని దారుణం.. అత్తారింటికి వెళ్లి భార్య, పిల్లలుసహా ఐదుగురి సజీవ దహనం

Family Burnt Alive: భార్య తనతోపాటు కాపురానికి రావడం లేదని దారుణానికి తెగబడ్డాడో దుర్మార్గుడు. భార్య, ఇద్దరు పిల్లలతోపాటు, అత్తామామల్ని సజీవ దహనం చేశాడు. ఈ ఘటన పంజాబ్, జలంధర్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది.

BF.7 Variant: దూసుకొస్తున్న కరోనా కొత్త వేరియంట్.. బీఎఫ్.7తో ముప్పే అంటున్న నిపుణులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్‌దీప్ సింగ్‌కు, పరంజిత్ కౌర్ అనే మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి అర్షదీప్ (8), అన్మోల్ (5) అనే పిల్లలు ఉన్నారు. అయితే, కుల్‌దీప్ సింగ్‌ తరచూ తాగి వచ్చి, భార్యా పిల్లల్ని కొట్టేవాడు. చాలా ఏళ్ల నుంచి ఇలాగే చేస్తుండటంతో భరించలేకపోయిన పరంజిత్ పిల్లల్ని తీసుకుని, పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలతో కలిసి, అమ్మానాన్నల దగ్గరే ఉంటోంది. దాదాపు ఆరు నెలల నుంచి ఆమె అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో తనతో కాపురానికి రావాల్సిందిగా కుల్‌దీప్ సింగ్‌, పరంజిత్ కౌర్‌ను కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో కోపం పెంచుకున్న కుల్‌దీప్ సింగ్‌.. మరో ఇద్దరితో కలిసి సోమవారం రాత్రి పరంజిత్ ఇంటికి వెళ్లాడు.

UP Shocker: భార్యతో సోదరుడికి వివాహేతర సంబంధం ఉందని అనుమానం.. అన్నను కొట్టి చంపిన తమ్ముడు

వాళ్లు నిద్రిస్తున్న సమయంలో భార్య పరంజిత్‌తోపాటు, ఇద్దరు పిల్లలు, పరంజిత్ తల్లిదండ్రులపై.. మొత్తం ఐదుగురిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఐదుగురు సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.