Karnataka Minister: ప్రజా ప్రతినిధులకు ఖరీదైన కానుకలు పంచిన కర్ణాటక మంత్రి.. లక్ష నగదు, బంగారం, వెండి బహుమతులు

కర్ణాటకలో ఒక మంత్రి తన నియోజకవర్గంలోని కొందరు ప్రజా ప్రతినిధులకు ఖరీదైన బహుమతులు అందించాడు. గిఫ్టు బాక్సుల్లో రూ.లక్ష నగదు, బంగారం, వెండి, పట్టు చీర, ధోతి వంటివి ఉన్నాయి.

Karnataka Minister: ప్రజా ప్రతినిధులకు ఖరీదైన కానుకలు పంచిన కర్ణాటక మంత్రి.. లక్ష నగదు, బంగారం, వెండి బహుమతులు

Updated On : October 24, 2022 / 4:42 PM IST

Karnataka Minister: తన నియోజకవర్గంలో ఇటీవల గెలిచిన ప్రజా ప్రతినిధులకు ఖరీదైన బహుమతులు అందించాడో మంత్రి. ఈ విషయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. కర్ణాటకలో ఆనంద్ సింగ్
పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

Kerala CM: కేరళలో సీఎం వర్సెస్ గవర్నర్.. వీసీల రాజీనామా నిర్ణయంపై కోర్టుకు ప్రభుత్వం

ఆయన తన నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన సభ్యులకు ఖరీదైన కానుకలు అందించాడు. ప్రతి సభ్యుడికి రెండు బాక్సులు అందించాడు. ఈ బాక్సుల్లో రూ.లక్ష నగదు, 144 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి, పట్టు చీర, ధోతితోపాటు, ఒక డ్రై ఫ్రూట్ బాక్స్ అందించాడు. వీరిలో పంచాయతి సభ్యులకు మాత్రం తక్కువ నగదు ఉన్న బాక్సు ఇచ్చాడు. అలాగే వీరికి బంగారం మినహా మిగతావన్నీ ఉన్న బాక్సు అందించాడు. దీపావళి సందర్భంగా ఈ బహుమతులు అందించాడు. ఇలాంటివి మొత్తం 300 బాక్సులు బహుమతులుగా ఇచ్చాడు. కాగా, కొందరు ప్రతినిధులు ఈ బాక్సులు తీసుకునేందుకు నిరాకరించినట్లు తెలిసింది. అయితే, ఇంత ఖరీదైన కానుకలు ఇచ్చిన వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Sundar Pichai: ఆ మూడు ఓవర్లు కూడా చూశా.. నెటిజన్‌కు అద్దిరిపోయే రిప్లై ఇచ్చిన సుందర్ పిచాయ్

అవినీతి సొమ్ముతోనే ఈ బహుమతులు ఇచ్చాడని, తన రాజకీయ ప్రయోజనాల కోసమే నాయకుల్ని ఆకట్టుకునేందుకు ఈ గిఫ్టులు ఇచ్చాడని పలువురు విమర్శిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఈ పని చేసినట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ బహుమతులకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.