Kerala CM: కేరళలో సీఎం వర్సెస్ గవర్నర్.. వీసీల రాజీనామా నిర్ణయంపై కోర్టుకు ప్రభుత్వం

కేరళలో తొమ్మిది యూనివర్సిటీల వీసీలను రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆదేశించడం వివాదాస్పదమవుతోంది. ఈ నిర్ణయాన్ని అధికార పార్టీ తప్పుబడుతోంది. సీఎం పినరయి విజయన్ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Kerala CM: కేరళలో సీఎం వర్సెస్ గవర్నర్.. వీసీల రాజీనామా నిర్ణయంపై కోర్టుకు ప్రభుత్వం

Kerala CM: కేరళలోని తొమ్మిది యూనివర్సిటీలకు చెందిన వైస్ ఛాన్స్‌లర్లు (వీసీలు) రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆదేశించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.

Mumbai Businessman: అమ్మాయిని ‘ఐటమ్’ అన్న వ్యాపారి.. జైలు శిక్ష విధించిన కోర్టు

సోమవారం ఉదయం 11.30కల్లా రాజీనామాలు తనకు చేరాలంటూ ఆయన ఆదేశించినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ నిర్ణయాన్ని అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు సీఎం పినరయి విజయన్ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీసీలు ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని సూచించారు. ‘‘వీసీలను రాజీనామా చేయమనే అధికారం ఎవరికీ లేదు. వీసీలను నియమించేది గవర్నరే. ఒకవేళ వాళ్ల నియామకంలో ఏవైనా లోపాలుంటే దానికి ఆయనదే బాధ్యత. వీసీలు రాజీనామా చేయాలని ఆదేశించడం సరికాదు. యూనివర్సిటీలను నాశనం చేసేందుకే గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది’’ అని పినరయి వ్యాఖ్యానించారు.

మరోవైపు గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం అత్యవసర విచారణ జరగనుంది.