Samantha : ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ఆసక్తికర పోస్ట్.. ఆ రూమర్లపైనేనా?
సమంత హెల్త్ ప్రాబ్లబ్స్ కారణంగా సినిమాలకు కొంత విరామం ఇచ్చింది.

Actor Samantha Ruth Prabhu shares a cryptic note on Instagram
Samantha Ruth Prabhu : సమంత హెల్త్ ప్రాబ్లబ్స్ కారణంగా సినిమాలకు కొంత విరామం ఇచ్చింది. గత కొద్ది నెలలుగా ఆమె మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమాలకు విరామం ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. రెగ్యులర్‌గా ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఏప్రిల్ 28న తన పుట్టిన రోజును గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో సెలబ్రేట్ చేసుకుంది.
తాజాగా సామ్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. మీరు వృషభరాశిని ఎప్పటికీ కోల్పోకండి అనే కోట్‌ను షేర్ చేసింది. సమంత ది వృషభ రాశి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పోస్ట్ వైరల్‌గా మారగా.. గతకొన్ని రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న శోభితా దూళిపాళ్ల, చైతన్య పెళ్లి వార్తలపైనే సామ్ రియాక్ట్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
Sabari Movie Review : వరలక్ష్మి శరత్ కుమార్ ‘శబరి’ మూవీ రివ్యూ.. కూతురి కోసం తల్లి పోరాటం..
ఇదిలా ఉంటే.. హిందీలో సామ్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే తన సొంత నిర్మాణ సంస్థలోనూ మా ఇంటి బంగారం అనే ఆసక్తికర టైటిట్‌తో సినిమాను తెరకెక్కిస్తోంది.
Sabari Movie Review : వరలక్ష్మి శరత్ కుమార్ ‘శబరి’ మూవీ రివ్యూ.. కూతురి కోసం తల్లి పోరాటం..