Saudi Crown Prince: ప్రధాని మోదీ ఆహ్వానం.. వచ్చే నెలలో సౌదీ యువరాజు భారత పర్యటన

సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చే నెలలో ఇండియాలో పర్యటించనున్నారు. నవంబర్ 14న ఆయన ఇండియాలో పర్యటిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.

Saudi Crown Prince: ప్రధాని మోదీ ఆహ్వానం.. వచ్చే నెలలో సౌదీ యువరాజు భారత పర్యటన

Updated On : October 23, 2022 / 3:56 PM IST

Saudi Crown Prince: ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. ఇండోనేషియాలోని బాలిలో జరగనున్న జీ20 సమావేశంలో పాల్గొనబోయే ముందు రోజు ఆయన ఇండియాలో పర్యటిస్తారు.

Indians in Ukraine: ఈ మార్గాల్లో బయటపడండి.. యుక్రెయిన్‌లోని భారతీయులకు ప్రభుత్వ సూచన

వచ్చే నెల 15, 16 తేదీల్లో జీ20 సమావేశాలు జరుగుతాయి. నవంబర్ 14న మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇండియాలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తాజా సమాచారం. మోదీకి సౌదీ రాజు, యువరాజుతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. మోదీ గత సౌదీ పర్యటన సందర్బంగా ఇండియా రావాల్సిందిగా అక్కి యువరాజు సల్మాన్ బిన్‌ను కోరాడు. మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఇండియా రావాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజంతా ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

భారత పర్యటన అనంతరం ఆయన తిరిగి బాలిలో జరిగే సమావేశాలకు హాజరవుతారు. గతవారం సౌదీ చమురు శాఖ మంత్రి అబ్దులాజిజ్ బిన్ సల్మాన్ కూడా ఇండియాలో పర్యటించారు.