Indians in Ukraine: ఈ మార్గాల్లో బయటపడండి.. యుక్రెయిన్‌లోని భారతీయులకు ప్రభుత్వ సూచన

యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే భారతీయులు.. యుక్రెయిన్ విడిచి వెళ్లాలని ఆదేశించిన ప్రభుత్వం, ఇప్పుడు ఎలా వెళ్లాలో వివరిస్తూ కొన్ని సూచనలు చేసింది.

Indians in Ukraine: ఈ మార్గాల్లో బయటపడండి.. యుక్రెయిన్‌లోని భారతీయులకు ప్రభుత్వ సూచన

Indians in Ukraine: యుక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం తీవ్ర రూపం దాలుస్తుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడ ఉంటున్న భారతీయులను ఉన్నపళంగా దేశం విడిచి వెళ్లాలని ఇటీవల భారత రాయబార కార్యాలయం ఆదేశించింది.

Chandrayaan-3: వచ్చే ఏడాది జూన్‌లో చంద్రయాన్-3.. వెల్లడించిన ఇస్రో ఛైర్మన్

వీలున్నంత త్వరగా యుక్రెయిన్ విడిచి పెట్టాలని సూచించింది. తాజాగా దీనికి సంబంధించి కొన్ని సూచనలు చేసింది. భారతీయులు ఆ దేశం విడిచి బయటపడేందుకు ఉన్న మార్గాలను వివరించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి.. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ వివరాలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున పలు సూచనలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం.. భారతీయులు, యుక్రెయిన్ విడిచి పెట్టాలంటే పాస్‪‌పోర్ట్, యుక్రెయిన్ రెసిడెంట్ పర్మిట్, స్టూడెంట్ కార్డ్, స్టూడెంట్ సర్టిఫికెట్, ఎయిర్ టికెట్ వంటి డాక్యుమెంట్లు ఉండాలి. ఇక వారు ఉన్న ప్రదేశం నుంచి సురక్షితంగా బయటపడేందుకు ఐదు దారులు ఉన్నాయి.

Munugode bypoll: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియోపై కాంగ్రెస్ సీరియస్.. క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు

అవి యుక్రెయిన్-హంగేరి సరిహద్దు, యుక్రెయిన్-స్లొవేకియా సరిహద్దు, యుక్రెయిన్-మాల్దోవా సరిహద్దు, యుక్రెయిన్-పోలాండ్ సరిహద్దు, యుక్రెయిన్-రొమేనియా సరిహద్దు. ఈ ఐదు మార్గాల్లో ఏ ఒక్క మార్గంలోనైనా సురక్షిత ప్రదేశానికి చేరుకోవచ్చు. ఈ సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పాయింట్ల వద్ద సరైన డాక్యుమెంట్లు చూపించి, భారతీయ పౌరులు బయటపడొచ్చు.