Mumbai: చూసినందుకే హత్య.. తనను చూస్తున్నాడని యువకుడిపై ముగ్గురు దాడి.. తీవ్ర గాయాలతో బాధితుడి మృతి

తనను చూస్తున్నందుకే ఒక వ్యక్తిపై ముగ్గురు దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ దారుణ ఘటన ముంబైలో జరిగింది.

Mumbai: చూసినందుకే హత్య.. తనను చూస్తున్నాడని యువకుడిపై ముగ్గురు దాడి.. తీవ్ర గాయాలతో బాధితుడి మృతి

Updated On : October 24, 2022 / 12:44 PM IST

Mumbai: ముంబైలో దారుణం జరిగింది. తననే చూస్తున్నాడనే కారణంతో ఒక వ్యక్తిని కొట్టి చంపారు ముగ్గురు వ్యక్తులు. ఈ ఘటన ముంబైలోని మాతుంగా ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగింది. షాహూ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెస్టారెంటు వద్ద ఒక వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఉన్నాడు.

Shinde Camp MLAs: బీజేపీలోకి షిండే క్యాంపు ఎమ్మెల్యేలు.. త్వరలోనే వెళ్తారంటున్న ‘సామ్నా’

వారికి దగ్గరగా మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అయితే, ఆ ముగ్గురిలో ఒకరిని ఆ వ్యక్తి చూస్తున్నాడని వారు భావించారు. వెంటనే ఆ ముగ్గురిలోంచి ఒక వ్యక్తి వచ్చి.. తనను ఎందుకు చూస్తున్నావని ప్రశ్నించాడు. దీనికి అతడు లేదని సమాధానం ఇచ్చాడు. ఈ విషయంపై ఆ వ్యక్తికి, మిగిలిన ముగ్గురు వ్యక్తులకు మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ ఘటన దాడికి దారి తీసింది. ముగ్గురూ కలిసి అతడిపై దాడి చేశారు. బెల్టుతో తలపై కొట్టారు. శరీరమంతా ఎక్కడపడితే అక్కడ తీవ్రంగా దాడి చేశారు.

దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు.