Home » Author »Narender Thiru
తాను రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ సీఎంకు సవాల్ విసిరారు. లేకపోతే సీఎం రాజీనామా చేయాలన్నారు.
ఏపీ సీఎస్ సమీర్ శర్మ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తుంగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.
అత్తింటి వారు పెళ్లికి కానుకగా ఇచ్చిన కారుతో అత్తనే ఢీకొట్టి చంపాడో అల్లుడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, ఇతావా జిల్లాలోని అక్బర్ పూర్ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది.
వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరగబోయే సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ సిరీస్‌లో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతుంది. రెండు సిరీస్‌లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది.
చైనాలోని ఐఫోన్ల తయారీ ఫ్యాక్టరీలో కోవిడ్ విజృంభిస్తోంది. అయితే, అధికారులు మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో భయాందోళనకు గురైన కార్మికులు అక్కడ్నుంచి గేట్లు, ఫెన్సింగ్ దూకి పారిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్
చాత్ పూజ సందర్భంగా నీటిలో తర్పణం వదులుతుండగా ఒక కల్వర్టు కూలిపోయింది. ఈ ఘటనలో కల్వర్టుపై ఉన్న చాలా మంది నీటిలో పడిపోయారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించారు.
గుజరాత్, మోర్బి కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటనకు సంబంధించిన పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రాత్రిపూట ఇంట్లో నిద్రిస్తుండగా లోపలికి ప్రవేశించిందో మొసలి. వెంటనే లేచి చూసిన ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు ఉలిక్కి పడ్డారు. తెల్లారి అధికారులు వచ్చి సహాయక చర్యలు చేపట్టేవరకు ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు.
గుజరాత్, మోర్బి కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో విరాట్ కోహ్లీ బస చేసిన హోటల్ రూమ్‌కు సంబంధించిన వీడియో లీకైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై హోటల్ యాజమాన్యం స్పందించింది.
ట్విట్టర్ బ్లూటిక్ యూజర్లకు షాకివ్వబోతుంది ట్విట్టర్. ఇకపై ప్రొఫైల్‌లో బ్లూటిక్ ఉండాలంటే తప్పనిసరిగా బ్లూ మెంబర్షిప్ తీసుకోవాల్సిందే. దీనికి నెలనెలా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన జరిగిన ప్రాంతాన్ని ప్రధాని మోదీ మంగళవారం పరిశీలిస్తారు. ఈ మేరకు ప్రమాద స్థలాన్ని పరిశీలించడంతోపాటు, బాధిత కుటుంబాల్ని కూడా మోదీ పరామర్శిస్తారు.
త్వరలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను పదవి నుంచి తొలగించబోతున్నట్లు యుక్రెయిన్ ప్రకటించింది. ఈ మేరకు రష్యాలో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది.
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 60 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.
ఫుడ్ డెలివరీ చేయాల్సిన డెలివరీ మ్యాన్ ఆ ఫుడ్ తినేశాడు. అంతేకాదు.. ఆ ఫుడ్ తాను తిన్నానని, టేస్టు కూడా బాగుందని కస్టమర్‌కు మెసేజ్ చేశాడు. అవసరమైతే కంపెనీకి ఫిర్యాదు చేసుకోమన్నాడు.
దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన టీ20 మ్యాచులో టీమిండియా ఓటమి పాలైంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. భారత వరుస విజయాలకు ఈ మ్యాచ్ బ్రేక్ వేసింది.
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో పలువురు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో చాలా మందికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆదివారం సాయంత్రం జరుగుతున్న మ్యాచులో భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే అర్ధ శతకం సాధించి భారత జట్టుకు అండగా నిలిచాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులు సాధించింది.
పెద్ద పులి దాడిలో రైతు మరణించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, దక్షిణ ఖేరి అటవీ ప్రాంతంలో శనివారం జరిగింది. పశుగ్రాసం కోసం చెరుకు తోటకు వెళ్లిన రైతుపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో రైతు తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆదివారం ప్రారంభమైంది. టీమిండియా టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఒక మార్పు చేసింది. అక్సర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాకు చోటు కల్పించింది.