Home » Author »Narender Thiru
టీ20 వరల్డ్ కప్ నుంచి ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా నిష్క్రమించింది. శనివారం జరిగిన మ్యాచులో శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం సాధించడం ద్వారా ఆ జట్టు సెమీ ఫైనల్ చేరింది. రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంతో ఆస్ట్రేలియా సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి వైదొలిగిం
కాలేజీ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న యువతిని క్రేన్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక, బెంగళూరులో శుక్రవారం జరిగింది.
ట్విట్టర్ ఇండియా ఉద్యోగులకు శుక్రవారం ఒక పీడకలగా మిగిలింది. భారీ సంఖ్యలో భారతీయ ఉద్యోగుల్ని కంపెనీ నుంచి తొలగించారు. ఈ మేరకు మెయిల్స్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఉద్యోగులు కంపెనీ అకౌంట్స్ నుంచి లాగౌట్ అయ్యారు.
మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్, అంబర్‌పేట నుంచి ఒక ఫంక్షన్ కోసం వెళ్లిన వ్యక్తులు ఈతకు వెళ్లి, చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
బ్యాట్స్‌మెన్ వికెట్ల వెనకాల ఉండి బ్యాటింగ్ చేయడం ఎప్పుడైనా చూశారా? లేదా..! అయితే ఈ వీడియో చూడండి. తాజాగా ఒక బ్యాట్స్‌మెన్ వికెట్ల వెనకాల ఉండి బ్యాటింగ్ చేశాడు. ఇలా చేసినా తప్పు కాదంటున్నారు నిపుణులు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఒక ఆడియో సంస్థ ఫిర్యాదు చేసింది. తమ అనుమతి లేకుండా ‘కేజీఎఫ్-2’ చిత్రంలోని పాట వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘భారత్ జోడో యాత్ర’ ప్రచార వీడియోకు ‘కేజీఎఫ్-2’ సాంగ్ వాడుకోవడంపై సంస్థ ఫిర్యాదు చేసింది.
మొయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసులో కీలకంగా ఉన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాడేపల్లిగూడెంలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుద్ర అనే మహిళ విషయంలో సీఎం జగన్ స్పందించారు. ఆమెకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
చైనా రాకెట్ శకలాలు కూలిపోతాయనే భయంతో స్పెయిన్ అప్రమత్తమైంది. తమ దేశ గగనతలంలోని విమానాల్ని రద్దు చేసింది. ఎయిర్‌పోర్టుల్ని మూసివేసింది. రాకెట్ శకలాలు తమ గగనతలంలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో స్పెయిన్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలో ఎన్నికల సమరం మొదలు కానుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు డిసెంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది.
ఏపీలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇండ్లు కూలుస్తుండటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుందన్నారు. శనివారం ఈ గ్రామాన్ని పవన్ సందర్శించబోతున్నారు.
బీజేపీ ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈ హామీ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తమ హామీ నెరవేరుస్తామన్నారు.
తన కారుకు ఒరిగి నిల్చున్నాడనే కారణంతో ఆరేళ్ల బాలుడిని తన్నాడు కారు యజమాని. చిన్నారి బాలుడు అని కూడా చూడకుండా అమానవీయంగా ప్రవర్తించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు.
పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోకుండా తిరిగి పంపించారు ప్రభుత్వాసుపత్రి వైద్యులు. దీంతో గర్భిణి ఇంట్లోనే కవలలకు జన్మనిచ్చింది. అయితే, అధిక రక్తస్రావం కావడంతో అక్కడే మరణించింది. కాస్సేపటికి కవలలు కూడా ప్రాణాలు కోల్పో
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల తెలంగాణలో అరుదైన ఘనత సొంతం చేసుకోబోతున్నారు. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో ఆమె చేపట్టిన పాదయాత్ర శుక్రవారంతో 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతుంది. షర్మిల రాజకీయ ప్రస్థానంలో ఇదే మైలురాయిగా నిలుస్తుంది.
హైదరాబాద్ వచ్చి తన ప్రభుత్వాన్నే కూలుస్తానంటే చూస్తూ ఊరుకుంటానా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేల్ని కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తేలాలన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని కేసీఆర్ మీడియాతో పంచుకున్నారు.
ఇటీవల ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై విమర్శలు చేశారు. ఈ కొనుగోలుకు సంబంధించిన వీడియోను మీడియాకు విడుదల చేశారు.
శత్రు దేశాల క్షిపణుల్ని చీల్చీచెండాడే సరికొత్త రక్షణ మిస్సైల్స్‌ను భారత రక్షణ శాఖ బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. బుధవారం జరిపిన ‘ఏడీ-1 ఇంటర్సెప్టార్ మిస్సైల్’ పరీక్ష విజయవంతమైంది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్వహిస్తున్న ఒక ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్‌తోపాటు మరో నలుగురు గాయపడ్డారు. వెంటనే వీరిని అధికారులు ఆస్పత్రికి తరలించారు.
ట్విట్టర్ ఉద్యోగులకు ఆ సంస్థ నూతన అధినేత ఎలన్ మస్క్ షాక్ ఇవ్వబోతున్నారు. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పద్ధతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీన్ని అమలుచేయబోతున్నారు.