Home » Author »Narender Thiru
‘కర్మ’ ఎవ్వరినీ వదిలిపెట్టదని చెప్పేందుకు మరో ఉదాహరణ ఈ వీడియో. తమ పక్కనే ఒక బైక్‌పై వెళ్తున్న యువకుడిని తన్నేందుకు, మరో బైక్‌పై వెళ్తున్న యువతి ప్రయత్నించింది. అయితే, ఆమె పట్టు కోల్పోయి కింద పడింది.
ఫ్రాన్స్ తీరంలో 25 అడుగుల భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. ఒళ్లంతా గాయాలు, రక్తపు మరకలతో పడి ఉంది. దీన్ని రక్షించేందుకు అధికారులు అంతగా ప్రయత్నించడం లేదు. అలలు వస్తే వాటితోపాటే తిరిగి సముద్రంలోకి వెళ్తుందని భావిస్తున్నారు.
గత ఆగష్టులో వినాయక చవితి వేడుకలు జరిగిన కర్ణాటక, హుబ్లీలోని ఈద్గా మైదానంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. దీని కోసం ఎంఐఎం పార్టీ.. అధికారులకు దరఖాస్తు చేసుకుంది.
మధ్య ప్రదేశ్ అడవిలో పులి-నిల్గాయ్ మధ్య హైడ్ అండ్ సీక్ ఆట సాగింది. నిల్గాయ్కు కనిపించకుండా దాక్కుని, పులి దాన్ని వేటాడేందుకు ప్రయత్నించింది. ఈ తతంగాన్ని ఒక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి.
తన పెంపుడు కుక్కకు తిండి పెట్టడం లేదని బంధువునే హత్య చేశాడో వ్యక్తి. కుక్కకు తిండి పెట్టని కారణంగా తనతోపాటు కలిసి ఉంటున్న వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడ్డ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అనేక దేశాల్లో ఇరాన్ మహిళలకు సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా కేరళలోనూ ఈ తరహా ఉద్యమం మొదలైంది.
చీతాల వేట మొదలైంది. గత సెప్టెంబర్‌లో దేశంలోకి అడుగుపెట్టిన చీతాలు ఇప్పుడు తొలిసారిగా తమ వేట పూర్తి చేశాయి. ఆదివారం రాత్రి ఒక జింకను వేటాడినట్లు అధికారులు తెలిపారు.
సంపూర్ణ చంద్ర గ్రహణం మంగళవారం ఏర్పడనున్న సంగతి తెలిసిందే. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడితే, ఇంకొన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తుంది.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ 15 రోజుల్లోగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మునుగోడులో బీజేపీ ఓటమి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోల్‌కతాలో అత్యంత ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆయన కొన్న ఇంటి విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని అంచనా.
సుప్రీంకోర్టు విచారణను సోమవారం లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ చివరి పని రోజు సందర్భంగా ఈ ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఒక ప్యాసింజర్ విమానం దగ్గర్లోని నదిలో కూలిపోయింది. ఈ సమయంలో విమానంలో 40 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటన టాంజానియాలో జరిగింది.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ 10,297 ఓట్ల మెజారిటీ సాధించింది.
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని అంగీకరించారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు.
డ్రగ్స్‌కు బానిసైన ఒక కుర్రాడు సొంత కుటుంబాన్నే హత్య చేశాడు. తల్లిని, చెల్లిని, తాతను చంపాడు. అడ్డొచ్చిన మరో వ్యక్తినీ హత్య చేశాడు. నలుగురి మృతదేహాల్ని బావిలో పడేసి పరారయ్యాడు.
చిన్న పిల్లలు ఆడుకునే డమ్మీ కరెన్సీ నోట్లు ఇచ్చి రూ.20 లక్షలు కొల్లగొట్టిందో ముఠా. అంటే రూ.40 లక్షల డమ్మీ నోట్లు ఇచ్చి.. రూ.20 లక్షలు దోచుకెళ్లారు. తర్వాత విషయం గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇండియా-జింబాబ్వే జట్ల మధ్య ఆదివారం మెల్బోర్న్లో కీలక మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఇండియా సెమీ ఫైనల్ చేరుతుంది. లేదంటే ఇతర అవకాశాల మీద ఆధారపడాలి.
సీట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడటంతోపాటు, అధిక ఫీజులు వసూలు చేస్తున్న తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలపై ఏఎఫ్ఆర్సీ కొరడా ఝుళిపించింది. అక్రమంగా కేటాయించిన ఒక్కో సీటుకు రూ.10 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించింది.
ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ గత సెప్టెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. ప్రమాద సమయంలో కారు నడిపిన డా.అనహితపై కేసు నమోదు చేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు కంటే తక్కువ సీట్లే వస్తాయని జోస్యం చెప్పారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ ఎన్నికల అంశంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.