Home » Author »Narender Thiru
దేశంలో షార్ట్ వీడియోస్‌కు పాపులారిటీ పెరుగుతోంది. దీంతో కంటెంట్ క్రియేటర్స్ కూడా పెరుగుతున్నారు. ప్రస్తుతం దేశంలో 8 కోట్ల మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు.
విభజన హామీలైన ప్రత్యేక హోదా అంశాన్ని నెరవేర్చాలని ప్రధాని మోదీని కోరారు ఏపీ సీఎం జగన్. విశాఖపట్నంలో శనివారం జరిగిన సభలో మోదీతో కలిసి జగన్ పాల్గొన్నారు.
అడవికి రాజైన సింహం ఒక్కసారిగా వచ్చి మీద పడిపోతే.. ఇంకేమైనా ఉందా? ఒక్కసారిగా నిశ్చేష్టులవ్వాల్సిందే. ఇటీవల కొందరు సందర్శకుల వాహనంపైకి వేగంగా దూసుకొచ్చి దూకిందో సింహం.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో 105 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కు వినియోగించుకుంది. అది కూడా ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం ఉన్నా... తను పోలింగ్ బూత్‌కు వెళ్లి మరీ ఓటు వేయడం విశేషం.
మూఢ నమ్మకం మత్తులో ఒక మహిళ దారుణానికి సిద్ధపడింది. చనిపోయిన తన తండ్రిని తిరిగి బతికించేందుకు చిన్నారిని బలివ్వాలనుకుంది. దీనికోసం రెండు నెలల వయసున్న చిన్నారినిక కిడ్నాప్ చేసింది.
అన్నాచెల్లెళ్ల ప్రేమకు హద్దులుండవంటారు. ఈ వీడియో చూస్తే నిజమే అనిపించకమానదు. ఒక చెల్లికి అన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. అది చూడగానే ఆ చెల్లి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.
యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ మెడికల్ విద్యార్థులకు రష్యా గుడ్‌న్యూస్ చెప్పింది. అవసరమైతే తమ దేశంలో మెడిసిన్ చదవుకోవచ్చని ప్రకటించింది. మధ్యలో ఆపేసిన చదువును తమ దేశంలో పూర్తి చేయవచ్చని తెలిపింది.
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. 2023 జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర సాగుతుంది.
ఆర్డర్ చేసిన బిర్యానీ రావడం లేటయిందని రెస్టారెంట్ సిబ్బందిపై దాడి చేశారు కస్టమర్లు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
81 ఏళ్ల వయసులో భార్యను చంపేశాడు ఒక భర్త. 40 ఏళ్లుగా వీల్‌చైర్‌కే పరిమితమైన భార్యకు సేవలు చేయలేక ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఇటీవల జపాన్‌లో జరిగింది.
హైదరాబాద్, నిజాం కాలేజీ వద్ద డిగ్రీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. హాస్టల్ సీట్లు పూర్తిగా తమకే కేటాయించాలని డిగ్రీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
మన దేశంలో ట్విట్టర్ బ్లూ సర్వీస్ మొదలైంది. అంటే ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్ అకౌంట్ కావాలి అనుకునేవాళ్లు ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొందరు సబ్‌స్క్రైబ్ కూడా చేసుకున్నారు.
ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’ భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగిస్తోంది. దీనిపై ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన పంచుకుంటున్నారు. తాజాగా అన్నేకా పటేల్ అనే మహిళ ఈ అంశంపై చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
పాముల్లో అత్యంత పెద్దగా పెరగగలిగేవి గ్రీన్ అనకొండలు. తాజాగా ఒక గ్రీన్ అనకొండ ఒక వ్యక్తిపై దాడి చేయబోయింది. తనను పెంచుతున్న వ్యక్తిపై దాడికి ప్రయత్నించింది. అతడి చేతిని కరిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నంలో భేటీ కానున్నారు. ఏపీ పర్యటనకు వస్తున్న ప్రధాని.. పవన్‌తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల మైత్రి, ఏపీ రాజకీయాలు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల పాలనలో మహిళలపై వివక్ష, నియంత్రణ కొనసాగుతూనే ఉంది. తాజాగా మహిళల్ని పార్కుల్లోకి రాకుండా నిషేధం విధించారు. నైతిక శాఖా మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం రాత్రి జరిగిన బాణాసంచా పేలుడు ఘటనలో ముగ్గురు మరణించారు. అధికారులు మృతదేహాల ఆధారంగా వారిని గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వంద సంవత్సరాల వయసు దాటిన ఓటర్లు దేశంలో 2.5 లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వివిధ వయసుల వారికి సంబంధించిన గణాంకాలను ఈసీ ప్రకటించింది.
టీ20 వరల్డ్ కప్, రెండో సెమీ ఫైనల్లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా బ్యాటింగ్‌కు దిగింది.
మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తైంది. దీనిపై తీర్పు కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. రేపు ఉదయం తీర్పు వెలువడుతుంది.