Home » Author »Narender Thiru
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. మరోవైపు ఈ రోజుతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.
పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్. అయితే, ఈ అంశంపై రాష్ట్రాలు తమ అంగీకారాన్ని తెలపాలని ఆయన అన్నారు.
వీఎల్సీ మీడియా ప్లేయర్‌పై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ దీనిపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వీస్‌ను ఈ ఏడాది ప్రారంభంలో కేంద్రం నిలిపివేసింది.
దేశంలో పెరిగిపోతున్న బలవంతపు మత మార్పిడులపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బలవంతపు మత మార్పిడుల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ ఆగిపోతుండటంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు ముప్పు ఉన్న తనకు ఇలాంటి వాహనం కేటాయిస్తారా అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలలకు కాషాయ రంగు వేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు సీఎం బొమ్మై.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తుండగా కొందరు ముస్లిం యువకులు నల్లజెండాలతో నిరసన తెలిపారు.
పెంపుడు కుక్కల పెళ్లిని పూర్తి సంప్రదాయబద్ధంగా జరిపించాయి ఇరు కుటుంబాలు. గుర్గావ్కు చెందిన ఆడ, మగ కుక్కల కుటుంబాలు ఈ పెళ్లి తంతును వంద మంది అతిథుల మధ్య ఘనంగా నిర్వహించాయి.
మొన్న ట్విట్టర్.. నిన్న మెటా... ఇప్పుడు డిస్నీ.. వరుసగా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు డిస్నీ సంస్థ చెప్పింది. అమెజాన్ కూడా ఇదే బాటలో పయనించబోతుంది.
పంజాబ్‌లో గన్ వయొలెన్స్ ఎక్కువగా పెరిగిపోతోంది. దీనిపై భగవంత్ మన్ ఆధ్వర్యంలోని ఆప్ సర్కారు దృష్టిపెట్టింది. రాష్ట్రంలోని లైసెన్స్డ్ గన్లపై రివ్యూ చేస్తారు.
ముంబై ఎయిర్‌పోర్టులో ఆదివారం ఒక్క రోజే రూ.32 కోట్ల విలువైన 61 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం తరలిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. అలాగే ఏపీలోని పోలవరం ప్రాజెక్టు మరో ఐదేళ్లైనా పూర్తి కాదని అభిప్రాయపడ్డారు.
విశ్వ విజేతగా నిలిచింది ఇంగ్లండ్. టీ20 వరల్డ్ కప్-2022 ఫైనల్లో పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇది రెండోసారి
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే అందరికీ షాకిచ్చింది ఈ జంట.
ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నంద కుమార్‌కు చెందిన హోటల్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దీనిపై నంద కుమార్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
యువత చెడిపోతుందనే ఉద్దేశంతోనే ఒక్క యాడ్ కూడా చేయలేదని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఓట్లు రాకపోయినా జనసేన తరఫున నామినేషన్ వేస్తామని చెప్పారు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కొనసాగుతోంది. మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు చేసింది. 138 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది.
జగనన్న కాలనీ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారని వైసీపీని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ‘జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు’ కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ విజయనగరం జల్లా, గుంకలాంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించ�
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం సాయంత్రం ఢిల్లీతోపాటు సమీప ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది.
తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న సుకేష్ చంద్ర శేఖర్ త్వరలోనే బీజేపీలో చేరుతారని అభిప్రాయపడ్డారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. సుకేష్ ప్రస్తుతం బీజేపీ భాష నేర్చుకుంటున్నాడని విమర్శించారు.