Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీకి ముస్లింల షాక్.. నల్ల జెండాలతో నిరసన.. మోదీ నినాదాలు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తుండగా కొందరు ముస్లిం యువకులు నల్లజెండాలతో నిరసన తెలిపారు.

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీకి ముస్లింల షాక్.. నల్ల జెండాలతో నిరసన.. మోదీ నినాదాలు

Updated On : November 14, 2022 / 3:44 PM IST

Asaduddin Owaisi: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముస్లింలు ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి షాక్ ఇచ్చారు. ఒవైసీ ప్రసంగిస్తుండగా కొందరు ముస్లి యువత నల్ల జెండాలు ప్రదర్శించారు. మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు.

Sweety weds Sheru: స్వీటీ పెళ్లి షేరూతో.. సంప్రదాయబద్ధంగా పెంపుడు కుక్కల పెళ్లి

ఈ ఘటన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరత్‌లో ఆదివారం జరిగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున అసదుద్దీన్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ర్యాలీలు, సభలు భారీగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సూరత్‌లో ఒక సభ నిర్వహిస్తుండగా అసదుద్దీన్ ఒవైసీకి షాక్ తగిలింది. సభలో కొందరు ముస్లిం యువకులు అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా నినదించారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఒవైసీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

అలాగే మోదీ.. మోదీ అంటూ నినదించారు. ఇదంతా ఒవైసీ చూస్తూ ఉండిపోయారు. మరోవైపు ఈ ర్యాలీల సందర్భంగా ఒవైసీ బీజేపీ, మోదీపై తీవ్ర విమర్శలు చేస్తూ సాగుతున్నారు.