Fuel Under GST: పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధం.. కానీ: పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్

పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్. అయితే, ఈ అంశంపై రాష్ట్రాలు తమ అంగీకారాన్ని తెలపాలని ఆయన అన్నారు.

Fuel Under GST: పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధం.. కానీ: పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్

Updated On : November 14, 2022 / 7:24 PM IST

Fuel Under GST: పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి. అయితే ఈ విషయంలో రాష్ట్రాలు అంగీకరించబోవని ఆయన చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Sweety weds Sheru: స్వీటీ పెళ్లి షేరూతో.. సంప్రదాయబద్ధంగా పెంపుడు కుక్కల పెళ్లి

‘‘పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలంటే రాష్ట్రాలు దీనికి అంగీకరించాలి. రాష్ట్రాలు ఒప్పుకొంటే దీనికి కేంద్రం సిద్ధంగా ఉంది. అలాగే, దీన్ని ఎలా అమలు చేయాలి అనేది మరో అంశం. ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దగ్గర లేవనెత్తాలి. మద్యం, చమురు.. రెండూ రాష్ట్రాలకు ఆదాయ వనరులు. ఆదాయం వచ్చే మార్గాన్ని రాష్ట్రాలు ఎందుకు వదులుకుంటాయి? ద్రవ్యోల్బణం, ఇతర అంశాలపై ఆలోచిస్తుంది ఒక్క కేంద్రం మాత్రమే’’ అని హర్‌దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలపై కూడా ఆయన మాట్లాడారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అనేక దేశాల్లో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. ఉత్తర అమెరికాలో ఏడాదిలో పెట్రో ధరలు 43 శాతం పెరిగాయి.

Supreme Court: బలవంతపు మత మార్పిడులతో జాతీయ భద్రతకు ముప్పు: సుప్రీంకోర్టు

మన దేశంలో మాత్రం 2 శాతమే పెరిగాయి. అనేక దేశాలు పెట్రో కొరత ఎదుర్కొంటున్నాయి. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కానీ, మనకు మాత్రం ఇంధన కొరత లేదు. అన్ని రాష్ట్రాలకు సరఫరాలో కూడా ఎలాంటి లోటు లేదు. కోవిడ్ సమయంలో పెట్రో ధరలు భారీగా తగ్గాయి. అయితే, ఇప్పుడు మళ్లీ పెరిగాయి’’ అని హర్‌దీప్ సింగ్ వ్యాఖ్యానించారు.