CM Bommai: పాఠశాలలకు కాషాయ రంగు వేస్తే తప్పేంటి.. ప్రతిపక్షాల్ని ప్రశ్నించిన కర్ణాటక సీఎం బొమ్మై

కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలలకు కాషాయ రంగు వేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు సీఎం బొమ్మై.

CM Bommai: పాఠశాలలకు కాషాయ రంగు వేస్తే తప్పేంటి.. ప్రతిపక్షాల్ని ప్రశ్నించిన కర్ణాటక సీఎం బొమ్మై

Updated On : November 14, 2022 / 4:22 PM IST

CM Bommai: ప్రభుత్వ పాఠశాలలకు కాషాయ రంగు వేస్తే తప్పేంటని ప్రశ్నించారు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై. జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో బొమ్మై పాల్గొన్నారు.

Sweety weds Sheru: స్వీటీ పెళ్లి షేరూతో.. సంప్రదాయబద్ధంగా పెంపుడు కుక్కల పెళ్లి

ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు కాషాయ రంగు వేయాలన్న నిర్ణయంపై స్పందించారు. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు కాషాయ రంగు వేయాలని నిర్ణయించింది. దీనిపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. దీనిపై బొమ్మై స్పందించారు. ‘‘ప్రభుత్వ పాఠశాలలకు కాషాయ రంగు ఎందుకు వేయకూడదు. కాషాయ రంగు అంటేనే ప్రతిపక్షాలకు భయం. కాషాయం అంటే మన జాతీయ పతాకంలోని రంగు. పాఠశాలలకు కాషాయ రంగు వేయాలనే నిర్ణయం వెనుక ఉన్నది స్వామి వివేకానంద. క్లాస్‌రూమ్స్‌కు స్వామి వివేకానంద పేరు పెట్టాం.

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీకి ముస్లింల షాక్.. నల్ల జెండాలతో నిరసన.. మోదీ నినాదాలు

ఆయన ఒక సన్యాసి. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. ఇలాంటి వాటిపై రాజకీయం చేయడం తగదు’’ అని బవసరాజు బొమ్మై వ్యాఖ్యానించారు. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోంది. పాఠశాలలకు జాతీయ జెండాలోని మూడు రంగులు వేయాలని, అలా కాకుండా కాషాయ రంగు ఒక్కటే ఎందుకు అని కాంగ్రెస్ ప్రశ్నించింది.