AAP: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి షాక్.. ఆప్‌లో చేరిన కమలం నేతలు
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. మరోవైపు ఈ రోజుతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

AAP: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు 11 మంది సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో రోహిణికి చెందిన 53వ వార్డు మెంబర్ కూడా ఉన్నారు.
Sweety weds Sheru: స్వీటీ పెళ్లి షేరూతో.. సంప్రదాయబద్ధంగా పెంపుడు కుక్కల పెళ్లి
వాళ్లు చేసిన సేవలకు ఆ పార్టీలో గుర్తింపు లేని కారణంగానే తమ పార్టీలో చేరుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ‘‘గత 15 ఏళ్లుగా బీజేపీకి చెందిన నేతలు చెత్త నిర్వహణ గురించి అడుగుతూనే ఉన్నారు. కానీ, అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఈ ప్రాంతంలోని నేతలు రోహిణి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు’’ అని ఆప్ నేతలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఢిల్లీ మున్సిపల్ పరిధిలో 250 వార్డులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ పోటాపోటీగా తలపడుతున్నాయి.
డిసెంబర్ 4న ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో 8 జాతీయ పార్టీలు, ఒక రాష్ట్ర స్థాయి పార్టీతోపాటు 50-55 ప్రాంతీయ పార్టీల తరఫున నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు సమాచారం. నామినేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాత ఎంత మంది అభ్యర్థులు నామినేషన్ వేశారో తెలుస్తుంది.