Home » Author »Narender Thiru
బర్త్ డే పార్టీ విషయంలో పదో తరగతి విద్యార్థినుల మధ్య గొడవ తలెత్తింది. దీంతో మనస్తాపానికి గురైన బాలికలు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా, ఆరెపల్లిలో జరిగింది.
ఢిల్లీలో తమ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించారు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు.
దేశీయ విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్’ ఏపీలోని విశాఖపట్నంలో తన సేవలు ప్రారంభించనుంది. విశాఖపట్నం-బెంగళూరు మధ్య వచ్చే నెల 10 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.
బ్రిటీష్ లగ్జరీ సూపర్ కార్ల సంస్థ ‘మెక్ లారెన్’ ఇండియాలో అడుగుపెట్టింది. దేశంలో మొదటి షో రూమ్‌ను ముంబైలో గురువారం ప్రారంభించింది. పలు సూపర్ కార్ మోడళ్లను లాంఛ్ చేసింది.
కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ చేసేందుకు ఒక అమ్మాయి పెద్ద సాహసమే చేసింది. ఏకంగా నాలుగు ఖండాలు దాటింది. దాదాపు 30,000 కిలోమీటర్లు ప్రయాణించి ఫుడ్ డెలివరీ చేసింది.
‘ఫిఫా వరల్డ్ కప్-2022’ ఆదివారం నుంచి ఖతార్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్టేడియాల పరిసరాల్లో బీర్ల అమ్మకాలపై నిషేధం విధించింది. ఈ టోర్నీ డిసెంబర్ 18 వరకు జరుగుతుంది.
రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ యుక్రెయిన్‌లోని కీలక ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు కోటి మంది ప్రజలు చీకట్లోనే ఉంటున్నారు.
ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్నప్పటి నుంచి సంస్థ విషయంలో గందరగోళం నెలకొంది. తాజాగా వందలాది ఉద్యోగులు కంపెనీకి రాజీనామా చేస్తున్నారు. అయితే, దీనిపై ఎలాంటి ఆందోళనా లేదంటున్నాడు ఎలన్ మస్క్.
తమ పార్టీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకే టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. మరోవైపు కేటీఆర్, కవిత.. ఎవరు తమ పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు.
దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధ హత్య ఘటనలాగే బంగ్లాదేశ్‌లో మరో ఘటన జరిగింది. అక్కడ కూడా ఒక వ్యక్తి తన ప్రేయసిని ముక్కలుగా నరికి చంపాడు. అయితే, బాధిత యువతి భారతీయురాలు.
జవానుకు, టీటీఈకి మధ్య జరిగిన వాగ్వాదంలో జవాన్‌ను రైలు లోంచి బయటకు తోసేశాడు టీటీఈ. ఈ ఘటనలో జవాన్ రైలు కింద పడి కాలు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ కూడా చేరారు. ఆయన శుక్రవారం రాహుల్ గాంధీని కలుసుకుని, పాదయాత్రలో పాల్గొన్నారు. మరోవైపు రాహుల్‌ను చంపుతామంటూ ఇండోర్‌లో బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది.
టీ20 వరల్డ్ కప్ ముగిసిన వారం రోజుల్లోపే క్రికెట్ అభిమానుల కోసం మరో టోర్నీ సిద్ధమైంది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్లూ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతాయి.
హైదరాబాద్ మహా నగరంలో శుక్రవారం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ రేసింగ్ కోసం ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఒక కేసు మీద అరెస్టైన 70 ఏళ్ల వృద్ధుడు పోలీస్ స్టేషన్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ఒకరిని సస్పెండ్ చేశారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.
ఆత్మహత్య చేసుకునేందుకు ప్రభుత్వ బిల్డింగ్ పైకి ఎక్కాడో వ్యక్తి. ఆరో ఫ్లోర్ నుంచి ఏకంగా కిందికి దూకేశాడు. అయితే, అతడు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రస్తుతం అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ట్విట్టర్‌కు పోటీగా మన దేశంలో ప్రారంభమైన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’. ఇప్పటికే ఇండియాతోపాటు పలు దేశాల్లో మంచి ఆదరణ పొందుతున్న ఈ యాప్ సేవలు త్వరలో అమెరికాలో పూర్తి స్థాయిలో మొదలుకానున్నాయి.
పేరెంట్స్-టీచర్ మీట్ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. స్కూల్లో టీచర్లు ఒక విద్యార్థితో పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే, దీన్ని తప్పించుకునేందుకు అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు.
బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్! ఈ నెల 19, శనివారం బ్యాంకులు దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నాయి. దీంతో శనివారం బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించిపోయే అవకాశం ఉంది.
గుజరాత్, మోర్బి బ్రిడ్జి కూలిన ఘటనపై మోర్బి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. బ్రిడ్జి మరమ్మతుల కోసం కంపెనీ తమపై ఒత్తిడి తెచ్చిందని, అప్పుడే బ్రిడ్జి ఓపెన్ చేసి ఉండకూడదని అఫిడవిట్లో పేర్కొంది.