Home » Author »Narender Thiru
హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది. అమెజాన్ అనుబంధ సంస్థ ‘అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)’ మంగళవారం నుంచి తమ సర్వీసెస్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో న్యూజిలాండ్ 19.4 ఓవర్లలోనే 160 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.
యజమాని కుటుంబానికి చెందిన యువకుడు వేరే ఊరు వెళ్తుండటంతో వాళ్లింట్లో పని మనిషి అతడికి ఘనమైన వీడ్కోలు పలికింది. తమ ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపించే సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు తెలుసుకోబోయే ప్రేమ కథ కూడా అలాంటిదే. 70 ఏళ్లు వృద్ధుడిని, 19 ఏళ్ల యువతి ప్రేమించి, పెళ్లి చేసుకుంది.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేపై రేప్ కేసు పెట్టింది అతడి భార్య. తనపై అత్యాచారం చేయడంతోపాటు పలు వేధింపులకు గురి చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కారణంతో ఆమెను కాల్చి చంపాడు తండ్రి. ఈ హత్యలో ఆమె తల్లి కూడా సహకరించింది. పోలీసుల విచారణలో నిజం బయటపడింది.
ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. నేపియర్‌లో ఉన్న మెక్ లీన్పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రేపటి మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ ఇండియా సొంతమవుతుంది.
దేశంలో నిషేధానికి గురైన ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ప్రస్తుతం ఖతార్‌లో కనిపించాడు. అక్కడ జరుగుతున్న ‘ఫిఫా వరల్డ్ కప్-2022’ సందర్భంగా ఇస్లాంకు సంబంధించి పలు బోధన కార్యక్రమాల్లో జకీర్ పాల్గొనబోతున్నాడు.
విజయ్ హజారే ట్రోఫీలో సోమవారం సరికొత్త రికార్డు నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు ఏకంగా 50 ఓవర్లలో 506 పరుగులు సాధించింది. నారాయణ్ జగదీషన్ అనే బ్యాటర్ అయితే, 141 బంతుల్లోనే 271 పరుగులు చేశాడు.
రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుల విడుదలపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. నిందితులను విడుదల చేస్తూ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది.
ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధ హత్య తరహాలో యూపీలో మరో ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన మాజీ ప్రేయసిని చంపి, ముక్కలుగా నరికి బావిలో పడేశాడు.
ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఇటీవలే ట్విట్టర్, మెటా, అమెజాన్ సంస్థలు ఉద్యోగుల్ని తొలగించగా, ఇప్పుడు జొమాటో కూడా అదే బాట పట్టింది. ఈ సంస్థ కనీసం 3 శాతం ఉద్యోగుల్ని తొలగిస్తోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ శనివారం కవలలకు జన్మనిచ్చారు. ఈషాకు పాప, బాబు జన్మించినట్లు ముకేష్ అంబానీ కుటుంబం ప్రకటించింది. ఈషా అంబానీ-ఆనంద్ పిరమాల్‌కు 2018లో వివాహం జరిగింది.
పశ్చిమ బెంగాల్, సిలిగురిలోని ఒక బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ఇంట్లో సిలిండర్ పేలడం వల్ల మంటలు క్రమంగా బస్తీ అంతటా వ్యాపించాయి. ఈ ఘటనలో 50 ఇండ్లు దగ్ధమయ్యాయి. 12 మంది గాయపడ్డారు.
140 సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది అనుకున్న ఒక పక్షి మళ్లీ కనిపించింది. నెమలిలాంటి ఒక అరుదైన పావురాన్ని శాస్త్రవేత్తలు ఇటీవల తిరిగి గుర్తించారు. ఈ పక్షిని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
వైల్డ్ లైఫ్‌కు సంబంధించిన వీడియోలు ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా చిరుతను వేటాడేందుకు వచ్చిన కొండ చిలువకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 26న ‘పీఎస్ఎల్వీ-సీ 54’ రాకెట్ ప్రయోగించబోతుంది. దీని ద్వారా ఓషన్‌శాట్-3ఏ ఉపగ్రహంతోపాటు, మరో 8 నానో శాటిలైట్లను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది.
అమెరికాలోని కొలరాడోలో ఉన్న ఒక గే నైట్ క్లబ్లో ఒక వ్యక్తి శనివారం రాత్రి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 18 మందికిపైగా గాయపడ్డారు.
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరి కొందరు గాయపడ్డారు. వికారాబాద్ డిపో నుంచి బస్సు ధరూర్ జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడమే ఘటనకు కారణమని తెలుస్తోంది.
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాణించింది. బ్యాటింగ్‌లో సూర్య కుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగితే, బౌలింగ్‌లో దీపక్ హుడా 4 వికెట్లు తీశాడు.