Isha Ambani: కవలలకు జన్మనిచ్చిన ఈషా అంబానీ.. ఒకే కాన్పులో పాప, బాబు.. చిన్నారులకు పేర్లు పెట్టేసిన అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ శనివారం కవలలకు జన్మనిచ్చారు. ఈషాకు పాప, బాబు జన్మించినట్లు ముకేష్ అంబానీ కుటుంబం ప్రకటించింది. ఈషా అంబానీ-ఆనంద్ పిరమాల్‌కు 2018లో వివాహం జరిగింది.

Isha Ambani: కవలలకు జన్మనిచ్చిన ఈషా అంబానీ.. ఒకే కాన్పులో పాప, బాబు.. చిన్నారులకు పేర్లు పెట్టేసిన అంబానీ

Updated On : November 20, 2022 / 8:51 PM IST

Isha Ambani: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ మరోసారి తాతయ్యారు. ఆయన కుమార్తె ఈషా అంబానీ శనివారం కవలలకు జన్మనిచ్చారు. తమ కుమార్తె ఈషాకు ఒకే కాన్పులో పాప, బాబు జన్మించినట్లు ముకేష్ అంబానీ కుటుంబం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Pheasant Pigeon: 140 సంవత్సరాల తర్వాత కనిపించిన అరుదైన పక్షి.. వీడియో ఇదిగో

ఈషా అంబానీ-ఆనంద్ పిరమాల్‌కు 2018లో వివాహం జరిగింది. ఆనంద్ పిరమాల్ ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ పిరమాల్-స్వాతి పిరమాల్ దంపతుల కొడుకు. అజయ్ పిరమాల్.. ‘పిరమాల్’ గ్రూప్ తరఫున ఫార్మా, హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్ సహా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈషా-ఆనంద్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో ఈషా-అజయ్ మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారడంతో, వారి పెళ్లికి పెద్దలు అంగీకరించారు. దీంతో 2018, డిసెంబర్ 12న ఈషా-అజయ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈషా వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. రిలయన్స్‪కు సంబంధించిన రిటైల్ వ్యాపార బాధ్యతల్ని ఆమె చూసుకుంటున్నారు.

ఫుడ్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్, జియో మార్ట్ వంటి వ్యాపారాల్ని ఈషా నిర్వహిస్తున్నారు. ఈషాకు జన్మించిన పిల్లలకు అంబానీ-పిరమాల్ కుటుంబాలు పేర్లు కూడా పెట్టాయి. పాపకు ఆదియా అని పేరు పెట్టగా, బాబుకు కృష్ణ అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి అందరి ఆశీస్సులు ఉండాలని ఇరు కుటుంబాలు ఆకాంక్షించాయి.