Home » Author »Narender Thiru
కెనడాలో 20 ఏళ్ల భారతీయ విద్యార్థి మరణించాడు. గత ఏడాది చదువు కోసం కెనడా వెళ్లిన యువకుడు అక్కడి టొరంటో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
తెలంగాణకు చెందిన నేత కార్మికుడిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. వచ్చే ఏడాది జరగబోయే జీ-20 సదస్సుకు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. జీ-20 సదస్సు లోగోను నేత కార్మికుడు మగ్గంపై నేసి ప్రధానికి పంపాడు.
హైదరాబాద్ మహా నగరంలో రెండో దశ మెట్రో నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగబోతుంది. ఆయన కూతురు రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేయనుంది. దీనికోసం లాలూ సింగపూర్ చేరుకున్నారు.
ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం ఉదయం రెండో వన్డే జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఇండియా టోర్నీ గెలిచే అవకాశాలుంటాయి.
అమెరికాలో హోమ్ లెస్ మ్యాన్‌కు ఒక సెలూన్ షాపు యజమాని ఉచితంగా హెయిర్ కట్, షేవింగ్ చేశాడు. ఇదంతా పూర్తైన తర్వాత హోమ్ లెస్ మ్యాన్ కనిపించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ట్రక్కులాంటి భారీ వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి. అందులోనూ రివర్స్ వెళ్లాలంటే డ్రైవర్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కానీ, ఒక డ్రైవర్ మాత్రం ట్రక్కు ఎక్కకుండానే, బయటి నుంచే దాన్ని పార్క్ చేశాడు.
పందుల పెంపకం కోసం చైనా భారీ నిర్మాణం చేపట్టబోతుంది. పందుల కోసం ప్రపంచంలోనే పెద్దదైన బిల్డింగ్ నిర్మిస్తోంది. ఇదో ‘పిగ్ ప్యాలెస్’. దీనిలో ఏకంగా 26 అంతస్థులు ఉంటాయి.
ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శించిన ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. యోగి ట్వీట్ రీట్వీట్ చేసిన కేజ్రీవాల్.. ట్విట్టర్ ద్వారానే సమాధానం ఇచ్చారు.
మనీ లాండరింగ్ కేసులో తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ఆయనకు జైలులో జైన మతానికి చెందిన ప్రత్యేక ఆహారం అందించేందుకు కోర్టు నిరాకరించింది.
సముద్రంలో తేలియాడే మహా నగరాన్ని నిర్మించేందుకు సౌదీ అరేబియా సిద్ధమవుతోంది. అలాగని ఇది సిటీ మాత్రమే కాదు.. ఒక భారీ నౌక కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకను ‘పాంజియోస్’ పేరుతో నిర్మించబోతుంది.
తాలిబన్లు అఫ్ఘనిస్తాన్‌లో అనాగరిక పద్ధతులు పాటిస్తున్నారు. గే సెక్స్, వ్యభిచారం వంటి పనులు చేసినందుకుగాను 12 మందిని శిక్షించారు. బహిరంగంగా కొరడా దెబ్బలు కొట్టారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహిళా నేతకు చెందిన ఫార్చ్యూనర్ కారు చోరీకి గురైంది. ఈ కారు చోరీ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటన సిగ్గుచేటని ఆ నేత వ్యాఖ్యానించింది.
ఆస్ట్రేలియాలో పని చేస్తూ, అక్కడి మహిళను హత్య చేసిన భారతీయుడిని తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగేళ్ల క్రితం హత్యకు పాల్పడ్డ నిందితుడు, ఇండియా పారిపోయి వచ్చేశాడు. భార్య, పిల్లల్ని అక్కడే వదిలేశాడు.
బిహార్‌లో అనాగరిక సంఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి గ్రామ పెద్దలు విధించిన శిక్ష సంచలనంగా మారింది. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష విధించి, వదిలిపెట్టారు.
న్యూజిలాండ్‌తో ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ముంగిట 307 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
సీబీఐ, ఈడీ సంస్థలు తన చేతికి ఒక్క రోజు వస్తే చాలని, సగం మంది బీజేపీ నేతలు జైల్లోనే ఉంటారని వ్యాఖ్యానించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు.
ఇకపై రోబోలు మనుషుల్ని చంపబోతున్నాయి. ఔను! మనుషుల్ని చంపగలిగే రోబోల్ని అమెరికా పోలీసులు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులకు ప్రతిపాదనలు కూడా పంపారు.
రాజస్థాన్, బిల్వారాలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ హత్య నేపథ్యంలో ఉద్రిక్తత తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
పాత ఢిల్లీ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలక్ట్రానిక్స్ హోల్‌సేల్ మార్కెట్‌కు సంబంధించిన బిల్డింగ్‌లో గురువారం రాత్రి మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.