Old Delhi: పాత ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న 40 ఫైర్ ఇంజిన్లు
పాత ఢిల్లీ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలక్ట్రానిక్స్ హోల్‌సేల్ మార్కెట్‌కు సంబంధించిన బిల్డింగ్‌లో గురువారం రాత్రి మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Old Delhi: పాత ఢిల్లీ నగరంలోగురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక ఎలక్ట్రానిక్స్ హోల్‌సేల్ మార్కెట్‌కు సంబంధించిన బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర.. మనీష్ సిసోడియా ఆరోపణ
మొదట 18 ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ మంటలు ఆర్పడం సాధ్యపడలేదు. దీంతో మరిన్ని ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. దాదాపు 40 వరకు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలంలో మంటలు ఆర్పుతున్నాయని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోయినప్పటికీ, అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మంటలు ధాటిగా వ్యాపిస్తుండటంతో మంటలు అదుపులోకి తేవడం అగ్నిమాపక సిబ్బందికి కష్టమవుతోంది. ప్రస్తుతం అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగులో మూడు అంతస్తుల వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆస్తి నష్టం భారీగానే ఉండే ఛాన్స్ ఉంది. అయితే, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఢిల్లీ పరిధిలో అగ్ని ప్రమాదాలు కలవరపెడుతున్నాయి.
దీంతో ఢిల్లీ మున్సిపాలిటీ, లెఫ్టినెంట్ గవర్నర్ ఈ అంశంపై దృష్టిపెట్టారు. అగ్ని ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉన్న చాందిని చౌక్ వంటి ప్రాంతాల్లో ఫైర్ ఇంజిన్లు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచుతామని ఎల్జీ ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పురాతన భవనాలు ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.