India vs New Zealand: రేపే రెండో వన్డే.. న్యూజిలాండ్ చేతిలో వరుసగా ఓడిపోతున్న భారత్.. ఈ సారైనా విజయం దక్కేనా?

ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం ఉదయం రెండో వన్డే జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఇండియా టోర్నీ గెలిచే అవకాశాలుంటాయి.

India vs New Zealand: రేపే రెండో వన్డే.. న్యూజిలాండ్ చేతిలో వరుసగా ఓడిపోతున్న భారత్.. ఈ సారైనా విజయం దక్కేనా?

Updated On : November 26, 2022 / 9:25 PM IST

India vs New Zealand: ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగబోతుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. హామిల్టన్‌లోని సెడ్డాన్ పార్క్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.

Viral Video: వావ్! హెయిర్ కట్ తర్వాత యువకుడిలా మారిపోయిన హోమ్‌లెస్ మ్యాన్‌.. క్రేజీ వీడియో!

మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో ఇండియా టోర్నీ గెలవాలంటే రెండో వన్డే గెలవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మ్యాచ్ విజయం ఇండియాకు కీలకంగా మారింది. అయితే, న్యూజిలాండ్‌ విషయంలో భారత్ తడబడుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి ఆరు వన్డేల్లో ఇండియా ఐదింట ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ అంశం టీమిండియాను కలవరపరుస్తోంది. దీంతో ఎలాగైనా ఈ సారి మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో భారత జట్టు ఉంది. దీనిలో భాగంగా జట్టులో మార్పులు చేయాలని శిఖర్ ధావన్ భావిస్తున్నాడు. మొదటి వన్డేలో ఇద్దరు కీపర్లు ఆడారు. రిషబ్ పంత్, సంజూ శామ్సన్ ఇద్దరూ ఒకే మ్యాచ్‌లో ఆడటం వల్ల ఒక బౌలర్ లేదా ఆల్ రౌండర్‌ను పక్కనపెట్టాల్సి వచ్చింది. దీంతో బౌలింగ్ విభాగంలో విఫలం కావడంతో భారత జట్టు మొదటి వన్డేలో ఓటమి పాలైంది.

Viral Video: డ్రైవింగ్ సీట్లో కూర్చోకుండానే స్టీరింగ్ తిప్పి ట్రక్కు పార్కింగ్ చేసిన డ్రైవర్.. వైరల్ అవుతున్న వీడియో

అందుకే ఈ సారి ఇద్దరు కీపర్లలో ఒక్కరినే తీసుకోవాలని భావిస్తున్నారు. దీని ప్రకారం.. ఇటీవల వరుసగా విఫలమవుతున్న రిషబ్ పంత్‌ను పక్కనపెట్టే ఛాన్స్ ఉంది. పంత్ స్థానంలో దీపక్ హుడాకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. భారత జట్టుకు సంబంధించి బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉన్నా.. బౌలింగ్‌లో మాత్రం రాణించడం లేదు. బౌలింగ్ విభాగం కూడా బలపడితే భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం. అలాగే బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉంది.