Gold Price Fall : మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి రేట్లు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది (Gold Price Fall) .

Gold Price Fall : మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి రేట్లు ఇవే..

Gold Price Fall

Updated On : August 20, 2025 / 10:41 AM IST

Gold Price Fall : బంగారం కొనుగోలుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది (Gold Price Fall). గడిచిన రెండు వారాలుగా బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ కూడా గోల్డ్ రేటు భారీగా తగ్గింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది.

Gold

బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.550 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ.450 తగ్గింది. మరోవైపు వెండి ధరసైతం తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. ఔన్సు గోల్డ్ నాలుగు డాలర్లు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,318 డాలర్ల వద్ద కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.91,800 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,00,150 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,950 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,00,300 వద్దకు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.91,800 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,00,150కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ కిలో వెండిపై రూ.వెయ్యి తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,25,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,15,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,25,000 వద్ద కొనసాగుతుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

Also Read: Income Tax Notice 2025 : మీ క్రెడిట్ కార్డు ఖర్చులపై ఇన్‌కమ్ ట్యాక్స్ నిఘా.. ఇలా పేమెంట్ చేస్తే ఖతమే.. ఏ క్షణమైనా ఐటీ నోటీసులు రావొచ్చు!