Mrunal Thakur : నేషనల్ క్రష్ రష్మిక కాదంట మృణాల్ అంట.. బాలీవుడ్ నటుడి కామెంట్స్ వైరల్..

రష్మిక మందన్న నేషనల్ క్రష్ ట్యాగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అవినాష్ తివారి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. (Mrunal Thakur)

Mrunal Thakur : నేషనల్ క్రష్ రష్మిక కాదంట మృణాల్ అంట.. బాలీవుడ్ నటుడి కామెంట్స్ వైరల్..

Mrunal Thakur

Updated On : August 20, 2025 / 10:56 AM IST

Mrunal Thakur : హీరోయిన్ రష్మిక మందన్న నేషనల్ క్రష్ అనే ట్యాగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కన్నడలో కెరీర్ మొదలుపెట్టి టాలీవుడ్ లో స్టార్ అయి బాలీవుడ్ కి వెళ్లి దూసుకుపోతుంది రష్మిక. రష్మిక గ్లామర్ కి, ఆమె సక్సెస్ కి నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ఇచ్చేసారు. గత కొన్నాళ్లుగా నేషనల్ క్రష్ రష్మిక అనే అంటున్నారు. పలు స్టేజీలపై, సినిమా ఈవెంట్స్ లో కూడా రష్మికని అలాగే పిలిస్తే రష్మిక కూడా దానికి స్పందిస్తుంది.(Mrunal Thakur)

అయితే కొంతమంది అభిమానులు తమ తమ హీరోయిన్స్ ని కూడా నేషనల్ క్రష్ అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల కొంతమంది మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ కూడా ఆమెనే రియల్ నేషనల్ క్రష్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అవినాష్ తివారి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం వార్ 2 క్లైమాక్స్ మార్చారా? లేదా ఆ సినిమా కోసమా?

పలు సీరియల్స్, సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు అవినాష్ తివారిని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నేషనల్ క్రష్ గురించి అడగ్గా.. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ పర్ఫెక్ట్ గా అందుకు సరిపోతుంది. తను నేషనల్ క్రష్ పదానికి అర్హురాలు అని కామెంట్స్ చేసాడు. ఇంకేముంది మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ ని వైరల్ చేస్తుండగా రష్మిక ఫ్యాన్స్ ఈ కామెంట్స్ ని తప్పు పడుతూ విమర్శలు చేస్తున్నారు.

ఇప్పుడున్న హీరోయిన్స్ లో మృణాల్ ఠాకూర్ కూడా గ్లామరస్ గా కనిపిస్తూనే నటనతో మెప్పిస్తూ అన్ని పరిశ్రమలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకుంది. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. దీంతో ఆమె ఫ్యాన్స్ మృణాల్ ఠాకూర్ కొత్త నేషనల్ క్రష్ అంటున్నారు. ఇప్పుడు ఈ నేషనల్ క్రష్ ట్యాగ్ ఫ్యాన్స్ మధ్య వివాదంగా మారేలా ఉంది.

Also Read : Prabhas Anushka : 8 ఏళ్ళ తర్వాత ప్రభాస్, అనుష్క కలిసి..? అదే జరిగితే ఫ్యాన్స్ కి పండగే.. సినిమా కాదు కానీ స్పెషల్..