Home » Author »Narender Thiru
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ వేదికగా మొదటి వన్డే శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఈ అంశంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ స్పందించారు.
అంత్యక్రియల దగ్గరి నుంచి అస్థికల నిమజ్జనం వరకు అన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకొచ్చిందో సంస్థ. డబ్బులిస్తే చాలు.. అన్ని పనులూ తామే చేసి పెడతామని చెబుతోంది.
తమిళనాడులో పరువు హత్య వెలుగు చూసింది. తన కూతురు వేరు కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తోందని ఆమెను హత్య చేసింది తల్లి. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది.
ఐటీ శాఖ దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. బీజేపీ కుట్రలో భాగంగానే తనతోపాటు, తన కుటుంబ సభ్యులపై ఐటీ శాఖ దాడులకు పాల్పడిందని ఆరోపించారు మల్లారెడ్డి. ఈ విషయంపై సీఎం కేసీఆర్ తమను ముందే హెచ్చరించాడని మల్లారెడ్డి అన్నారు.
అమెరికాకు చెందిన నలుగురు మహిళా దౌత్యవేత్తలు ఢిల్లీ వీధుల్లో ఆటోలో చక్కర్లు కొట్టారు. తమ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వదిలేసి, ఆటో నడుపుకొంటూ తిరిగారు. దీనిపై వాళ్లు హర్షం వ్యక్తం చేశారు.
వరుసగా మూడో ఏడాది చైనాను కోవిడ్ వణికిస్తోంది. ఇటీవలి కాలంలో చైనాలో కోవిడ్ భారీ స్థాయిలో విజృంభిస్తోంది. సగటున రోజూ 30,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తాజాగా రీజనల్ కోఆర్డినేటర్లను పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయి.
పాకిస్తాన్ నుంచి ఇండియా వలస వచ్చిన పౌరులు రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరికి ఇటీవలే భారత ప్రభుత్వం పౌరసత్వం మంజూరు చేసింది.
ఒకే పేరు మాత్రమే ఉన్న ప్రయాణికుల్ని ఇకపై తమ దేశంలోకి అనుమతించబోమని యూఏఈ ప్రకటించింది. యూఏఈ వెళ్లాలంటే ఇకపై పేరులో కనీసం రెండు పదాలు తప్పనిసరిగా ఉండాలి.
ముంబైలో మీజిల్స్ వ్యాధి విజృంభిస్తోంది. చిన్నారులకు సోకే ఈ వ్యాధి కారణంగా నెల రోజుల్లో 13 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ సంపద రోజురోజుకూ తరిగిపోతుంది. సగటున ప్రతి రోజూ రూ.2,500 కోట్ల సంపద తగ్గిపోతున్నట్లు అంచనా. టెస్లా షేర్లు పడిపోవడం, ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకోవడం వంటివి దీనికి కారణాలు.
ఇప్పటికే నాలుగు విడతలుగా పాదయాత్ర పూర్తి చేసుకున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత యాత్రకు రెడీ అవుతున్నారు. ఈ నెల 28 నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారు.
దేశంలోకి పాకిస్తాన్ ఆయుధాలు, డ్రగ్స్ పంపాలనుకుంటోందని, అయితే పాక్ ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.
దత్తత తీసుకున్న పిల్లలకు కూడా తల్లిదండ్రుల నుంచి చట్టపరంగా సంక్రమించాల్సిన అన్ని హక్కులూ ఉంటాయని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. దత్తత తీసుకున్న కొడుకుకు తండ్రికి సంబంధించిన ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది.
ఫిఫా వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఖతార్ అనేక వివాదాలకు కారణమవుతోంది. తాజాగా రెయిన్ బో ఉన్న టీ షర్ట్ ధరించినందుకు ఒక అమెరికన్ జర్నలిస్టును స్టేడియంలోకి అనుమతించలేదు.
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో సినీ తారలు పాల్గొంటుండటంపై బీజేపీ విమర్శలు చేసింది. సినీ నటులకు కాంగ్రెస్ పార్టీ డబ్బులిచ్చి రప్పించుకుంటోందని విమర్శించింది.
టీ20 వరల్డ్ కప్-2024 కోసం ఇప్పట్నుంచే ఐసీసీ కసరత్తు ప్రారంభించింది. ఈ టోర్నీని మరింత ఆసక్తికరంగా మార్చాలని ఐసీసీ భావిస్తోంది. దీని కోసం టోర్నీ ఫార్మాట్లో కొన్ని కీలక మార్పులు చేసింది.
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త. మాలధారణ చేసిన భక్తులు ఇకపై ఇరుముడిని విమానంలో కూడా తీసుకెళ్లొచ్చు. దీనికి విమానయాన భద్రతా విభాగం తాజాగా అనుమతించింది.
అసోం-మేఘాలయ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేఘాలయకు చెందిన వ్యక్తుల్ని సరిహద్దులో అటవీ శాఖ అధికారులు కాల్చి చంపారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.