Adopted Son: సొంత కొడుకు కాకున్నా ఉద్యోగం ఇవ్వాల్సిందే.. దత్త పుత్రుడికీ అన్ని హక్కులుంటాయి: కర్ణాటక హైకోర్టు
దత్తత తీసుకున్న పిల్లలకు కూడా తల్లిదండ్రుల నుంచి చట్టపరంగా సంక్రమించాల్సిన అన్ని హక్కులూ ఉంటాయని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. దత్తత తీసుకున్న కొడుకుకు తండ్రికి సంబంధించిన ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది.

Adopted Son: సొంత కొడుకైనా.. దత్త పుత్రుడైనా ఎలాంటి వివక్షా లేదని, దత్తత తీసుకున్న పిల్లలకు కూడా అన్ని హక్కులు ఉంటాయని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. దత్త పుత్రుడికి కూడా కారుణ్య నియామక పద్ధతిలో తల్లిదండ్రులకు సంబంధించి ఉద్యోగాన్ని ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
Sabarimala Pilgrims: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. విమానంలో ఇరుముడి తీసుకెళ్లేందుకు అనుమతి
జస్టిస్ సూరజ్ గోవింద రాజ్, జస్టిస్ జి.బసవరాజతో కూడిన హైకోర్టు ధర్మాసనం తాజా తీర్పు వెలువరించింది. ఈ కేసు వివరాల ప్రకారం.. వినాయక్ అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి 2011లో గిరీష్ అనే వ్యక్తిని కొడుకుగా దత్తత తీసుకున్నాడు. అయితే, 2018లో వినాయక్ మరణించాడు. తర్వాత కొడుకు గిరీష్ తండ్రి మరణం ద్వారా రావాల్సిన కారుణ్య నియామకం కింద ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వ అధికారులు అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించారు. గిరీష్ సొంత కొడుకు కాదని, దత్త పుత్రుడు కాబట్టి.. అతడికి ఉద్యోగం ఇచ్చే నిబంధన ఏదీ లేదనే కారణంతో ఉద్యోగం ఇవ్వలేదు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గిరీష్ స్థానిక కోర్టును ఆశ్రయించాడు. అయితే, గిరీష్ పిటిషన్‌ను స్థానిక కోర్టు కొట్టివేసింది.
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్.. రెయిన్‌బో టీషర్ట్ ధరించినందుకు జర్నలిస్టుకు స్టేడియంలోకి నో ఎంట్రీ
దీంతో గిరీష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తల్లిదండ్రులు ఎవరినైనా దత్తత తీసుకుంటే అన్ని హక్కులూ వస్తాయని స్పష్టం చేసింది. అతడికి తన తండ్రి నుంచి రావాల్సిన ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘దత్త పుత్రుడికీ అన్ని హక్కులుంటాయి. దత్తత తీసుకున్న కూతురుకైనా.. కొడుకుకైనా తల్లిదండ్రుల నుంచి అన్ని హక్కులూ వస్తాయి. ఒకవేళ దత్తత తీసుకున్న పిల్లలకు ఇలాంటి హక్కులేవీ లేకుంటే దత్తత అనే దానికి అర్థమే లేదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.