Lt Gen Upendra Dwivedi: దేశంలోకి ఆయుధాలు పంపాలనుకుంటున్న పాక్ కుట్రలు సాగనివ్వం: ఆర్మీ కమాండర్

దేశంలోకి పాకిస్తాన్ ఆయుధాలు, డ్రగ్స్ పంపాలనుకుంటోందని, అయితే పాక్ ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.

Lt Gen Upendra Dwivedi: దేశంలోకి ఆయుధాలు పంపాలనుకుంటున్న పాక్ కుట్రలు సాగనివ్వం: ఆర్మీ కమాండర్

Updated On : November 22, 2022 / 8:20 PM IST

Lt Gen Upendra Dwivedi: దేశంలోకి పాకిస్తాన్ డ్రగ్స్, ఆయుధాలు పంపాలనుకుంటోందని, అయితే పాక్ కుట్రలు సాగనివ్వబోమని హెచ్చరించారు నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. మంగళవారం జమ్ము-కాశ్మీర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు.

Sabarimala Pilgrims: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. విమానంలో ఇరుముడి తీసుకెళ్లేందుకు అనుమతి

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘మన దేశ సరిహద్దు తీవ్రవాద శిబిరాల వద్ద 160 మంది తీవ్రవాదులు సిద్ధంగా ఉన్నారు. ఉత్తరాన ఉన్న పిర్ పంజాల్ వద్ద 130 మంది తీవ్రవాదలు, దక్షిణ పిర్ పంజాల్ వద్ద మరో 30 మంది ఉన్నారు. లోయలో 82 మంది పాక్ తీవ్రవాదులు, 53 మంది లోకల్ తీవ్రవాదులు ఉన్నారు. ఇంకా గుర్తించని 170 మంది తీవ్రవాదులు ఇక్కడ ఉన్నారు. మొత్తం ఈ ప్రాంతంలో 300 మంది వరకు తీవ్రవాదులు ఉన్నారు. కానీ, ఒక్కటే చెబుతున్నా.. వాళ్ల ద్వారా ఎలాంటి హానీ జరగకుండా చూస్తాం. తీవ్రవాదాన్ని చాలా వరకు నియంత్రించాం. పొరుగున ఉన్న దేశం ఇప్పుడు పిస్టల్స్, గ్రెనేడ్లు, డ్రగ్స్ వంటివి మన దేశంలోకి పంపాలనుకుంటోంది.

వాటి ద్వారా మనల్ని భయపెట్టాలనుకుంటోంది. కానీ, వారి ఆటలు సాగనివ్వం’’ అని ద్వివేది అన్నారు. చలికాలంలో సరిహద్దు భద్రత కోసం ప్రత్యేక వ్యూహాన్ని బీఎస్ఎఫ్ సిద్దం చేస్తోందని ఆయన చెప్పారు. మంగళవారం రోజే భద్రతా దళాలు సరిహద్దులో ఒక పాకిస్తాన్ చొరబాటుదారుడిని కాల్చి చంపాయి.