India vs New Zealand: రేపే న్యూజిలాండ్‌తో మూడో టీ20.. వర్షం ముప్పు తప్పదా?

ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. నేపియర్‌లో ఉన్న మెక్ లీన్‪పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రేపటి మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ ఇండియా సొంతమవుతుంది.

India vs New Zealand: రేపే న్యూజిలాండ్‌తో మూడో టీ20.. వర్షం ముప్పు తప్పదా?

Updated On : November 25, 2022 / 11:34 AM IST

India vs New Zealand: ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగబోతుంది. న్యూజిలాండ్‌లోని నేపియర్‌లో ఉన్న మెక్ లీన్‪పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇండియా 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

Uttar Pradesh: శ్రద్ధా హత్య తరహాలో యూపీలో మరో ఘటన.. మహిళను చంపి ఆరు ముక్కలుగా నరికిన మాజీ ప్రియుడు

మొదటి మ్యాచ్ వర్షం కారణంగా.. అసలు ప్రారంభం కాకుండానే రద్దుకాగా, రెండో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే ఇండియా టోర్నీ నెగ్గినట్లవుతుంది. ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే సిరీస్ సమమవుతుంది. ఇటీవల, న్యూజిలాండ్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం పడుతుండటంతో రేపటి మ్యాచ్ సందర్భంగా వర్షం పడుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, నేపియర్ వాతావరణ శాఖ నిపుణుల అంచనా ప్రకారం మంగళవారం వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

5 కంటే తక్కువ శాతం మాత్రమే వర్షం పడే ఛాన్స్ ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రేపటితో టీ20 సిరీస్ పూర్తవనుండగా, ఈ నెల 25 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. టీ20 సిరీస్‌కు హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా కొనసాగుతారు.