Home » Author »Narender Thiru
ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్ త్వరలోనే కంపెనీ బాధ్యతల నుంచి వైదొలగాలి అనుకుంటున్నాడు. కొంతకాలం తర్వాత ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకొని, కొత్తవారిని నియమిస్తానని మస్క్ చెప్పాడు.
ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హీరోయిన్ రష్మిక మందన్నాకు క్షమాపణలు చెప్పాడు. ఆమె నటించిన భీష్మ మూవీలోని పాటకు స్పూఫ్ వీడియో చేసినందుకు గాను, వార్నర్ సారీ చెప్పాడు.
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఈడీ విచారణపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఒక ముఖ్యమంత్రి అయిన తాను దేశం విడిచి పారిపోతానా అని ప్రశ్నించారు.
గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్, వేధింపులకు చెక్ పడబోతుంది. ఇకపై ఎవరు కాల్ చేసినా వారికి సంబంధించిన కచ్చితమైన పేరు తెలుస్తుంది. దీని కోసం కేంద్రం కొత్త చట్టం రూపొందిస్తుంది.
ఆటోలో ఇంటికి వెళ్తున్న బాలికపై డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. దీంతో భయపడిపోయిన బాలిక వేగంగా వెళ్తున్న ఆటోలోంచి బయటకు దూకేసింది. ఈ ఘటనలో బాలికకు గాయాలయ్యాయి.
ఆటోలో ప్యాసింజర్లు ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే తిరిగి రావడం కష్టం. కొంతమంది డ్రైవర్లు మాత్రం నిజాయితీగా, తమ కస్టమర్లకు వాళ్లు మర్చిపోయిన వస్తువుల్ని తిరిగిస్తుంటారు. అలా తాజాగా బెంగళూరులో ఒక డ్రైవర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నార�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయిన శశి థరూర్‌కు ఆ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. గుజరాత్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రచారకర్తల జాబితాలో ఆయనకు చోటు కల్పించలేదు.
విమాన ప్రయాణికులు మాస్క్ ధరించడంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇకపై విమానాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని ప్రకటించింది. దీనికి ఫైన్లు కూడా విధించబోమని చెప్పింది.
దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుల్లో ఒకడైన దినేష్ అరోరా అప్రూవర్‌గా మారేందుకు కోర్టు అనుమతించింది. అతడు ఆప్ నేత మనీష్ సిసోడియాకు సహచరుడు.
తను ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ చేయలేదని జొమాటో సంస్థపై కేసు వేశాడు ఒక లా స్టూడెంట్. దీనిపై విచారణ జరిపిన కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నష్టపరిహారం చెల్లించాలని జొమాటోను ఆదేశించింది.
పార్కింగ్ విషయంలో మొదలైన చిన్న గొడవలో హాలీవుడ్ నటిపై కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ ఘటన అమెరికా, లాస్ ఏంజిల్స్‌లో సోమవారం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రియురాలిని రిస్టార్ట్‌కు తీసుకెళ్లిన ఒక వ్యక్తి ఆమె గొంతు, చేయి కోసి హత్య చేశాడు. తర్వాత ఆ యువతి మృతదేహంతో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేశాడు.
అత్యంత తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లోకి విడుదలైంది. ముంబైకి చెందిన పీఎంవీ ఎలక్ట్రిక్ అనే సంస్థ ఈ కారును విడుదల చేసింది. బుధవారం నుంచి ఈ కారు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.
వాట్సాప్, మెటా సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు రాజీనామా చేశారు. వాట్సాప్ ఇండియా హెడ్‌గా ఉన్న అభిజిత్ బోస్, మెటా సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న రాజీవ్ అగర్వాల్ తమ పదవులకు రాజీనామా చేశారు.
ఇటీవల టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా భారత జట్టు ఓడిపోతుండటంపై బీసీసీఐ దృష్టి పెట్టింది. త్వరలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది.
తమ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రం కాళ్ల మీద పడి అడుక్కోవాలా అని ప్రశ్నించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నిధులు విడుదల చేయకపోవడంపై కేంద్రంపై మమత విమర్శలు చేశారు.
శ్రద్ధా వాకర్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. శ్రద్ధను హత్య చేసిన తర్వాత నెల రోజులలోపే అఫ్తాద్ మరో అమ్మాయితో డేటింగ్ చేశాడు. ఆమెను ఇంటికి కూడా రప్పించుకున్నాడు.
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని తాజాగా ఐక్యరాజ్య సమితి నివేదిక తేల్చింది. వచ్చే ఏడాదికల్లా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవనుంది ఇండియా.
అంగారకుడిపై పరిశోధనల కోసం నాసా ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ ఇన్సైట్ ల్యాండర్ త్వరలోనే నిలిచిపోనుంది. ఈ విషయాన్ని ఇన్సైట్ ల్యాండర్ స్వయంగా వెల్లడించింది.