MS Dhoni: టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా ఓటమి.. మార్పులకు సిద్ధమైన బీసీసీఐ.. ధోనీకి కీలక బాధ్యతలు
ఇటీవల టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా భారత జట్టు ఓడిపోతుండటంపై బీసీసీఐ దృష్టి పెట్టింది. త్వరలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది.

MS Dhoni: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఘోర వైఫల్యంపై బీసీసీఐ దృష్టి పెట్టింది. జట్టుకు సంబంధించి కీలక మార్పులు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతోంది.
InSight lander: ‘ఇక నా పని అయిపోయింది’.. మార్స్ నుంచి సందేశం పంపిన ఇన్‌సైట్ ల్యాండర్
అలాగే టీ20లు, వన్డేలు, టెస్టులు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ కీలక మార్పులు చేయాలనుకుంటోంది. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఒక్కడే అన్ని ఫార్మాట్లలోనూ జట్టును నడిపించడం సాధ్యం కాదని బీసీసీఐ భావిస్తోంది. దీంతో మూడు ఫార్మాట్లకు ముగ్గురు కోచ్‌లు, వేర్వేరు టీమ్‌లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. దీనిలో భాగంగా ఎం.ఎస్.ధోనికి కీలక బాధ్యతలు అప్పగించాలనుకుంటోంది. టీ20లకు సంబంధించిన బాధ్యతల్ని ధోనీకి అప్పగించాలని నిర్ణయించింది. ధోని టీ20ల్లో టీమిండియా అద్భుతంగా రాణించేలా చేయగలడని బీసీసీఐ నమ్ముతోంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ తర్వాత ధోని రిటైర్మెంట్ తీసుకునేలా చేస్తారు.
ఆ తర్వాత ఆయనకు టీమిండియా టీ20ల బాధ్యతలు అప్పగిస్తారు. కొంతకాలంగా ఇండియా.. టీ20లతోపాటు ఐసీసీ టోర్నమెంట్లలోనూ విఫలమవుతోంది. అంచనాలకు తగ్గట్లుగా ఆడలేకపోతోంది. అందుకే ఈ విషయంలో కీలక మార్పులు తెచ్చి, జట్టును తిరిగి విజయపథంలో నడిపించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఇండియా చివరిసారిగా టీ20 వరల్డ్ కప్ 2007లో నెగ్గగా, చివరి ఐసీసీ ట్రోఫీ 2013లో గెలిచింది. అప్పటి నుంచి కీలకమైన టోర్నమెంట్లేవీ ఇండియా నెగ్గలేదు.