Delhi murder: శ్రద్ధా హత్య తర్వాత మరో యువతితో అఫ్తాద్.. అప్పటికి ఫ్రిజ్‌లోనే శరీర భాగాలు.. విచారణలో సంచలన నిజాలు వెల్లడి

శ్రద్ధా వాకర్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. శ్రద్ధను హత్య చేసిన తర్వాత నెల రోజులలోపే అఫ్తాద్ మరో అమ్మాయితో డేటింగ్ చేశాడు. ఆమెను ఇంటికి కూడా రప్పించుకున్నాడు.

Delhi murder: శ్రద్ధా హత్య తర్వాత మరో యువతితో అఫ్తాద్.. అప్పటికి ఫ్రిజ్‌లోనే శరీర భాగాలు.. విచారణలో సంచలన నిజాలు వెల్లడి

Delhi murder: ప్రేయసి శ్రద్ధా వాకర్‌ను అఫ్తాద్ అమీన్ పూనావాలా అనే యువకుడు అత్యంత క్రూరంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. శ్రద్ధ శరీరాన్ని 35 ముక్కలుగా నరికి, ఢిల్లీలోని అనేక చోట్ల పాడేశాడు అఫ్తాద్. శ్రద్ధ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసుల విచారణ జరపగా, నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.

World’s Population: 800 కోట్లకు చేరుకున్న ప్రపంచ జనాభా.. అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవనున్న భారత్

అయితే, పోలీసుల విచారణలో మరిన్ని సంచలన నిజాలు వెల్లడయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అఫ్తాద్‌కు మరో అమ్మాయితో సంబంధం ఉన్నట్లు శ్రద్ధ అనుమానించింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలి అని ఒత్తిడి తెచ్చింది. ఈ విషయంలో ఇద్దరిమధ్యా వాగ్యుద్ధం జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన అఫ్తాద్ శ్రద్ధ గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచాడు. తర్వాత రోజూ అర్ధరాత్రి ఒక్కో ముక్కను ఢిల్లీలోని ఒక్కో ప్రాంతంలో పడేసి వచ్చాడు. శ్రద్ధను హత్య చేసిన తర్వాత డేటింగ్ యాప్ ద్వారా మరో అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. నెల రోజుల తర్వాత ఆ అమ్మాయిని తన ఇంటికి రప్పించుకున్నాడు. అప్పటికే ఫ్రిజ్‌లో శ్రద్ధ శరీర భాగాలు ఉన్నాయి. కానీ, అవి ఆ అమ్మాయికి కనిపించకుండా వాటిని కప్ బోర్డులో దాచేవాడు.

InSight lander: ‘ఇక నా పని అయిపోయింది’.. మార్స్‌ నుంచి సందేశం పంపిన ఇన్‌సైట్ ల్యాండర్

హత్యకు సంబంధించి ఎలాంటి క్లూ దొరక్కుండా సల్ఫర్ హైపోకెలోరిక్ యాసిడ్ వాడాడు. ఇంటర్నెట్‌లో వెతికి దీని గురించి తెలుసుకున్నాడు. తర్వాత ఈ కెమికల్ తీసుకొచ్చి, ఇంట్లో ఎలాంటి ఆధారాలు దొరకకుండా చూసుకున్నాడు. ఇలా చేయడం ద్వారా ఫోరెన్సిక్ నిపుణులకు కూడా దొరకకుండా రక్తపు మరకలు పూర్తిగా తుడుచుకుపోతాయని అతడి నమ్మకం. కాగా, అఫ్తాద్ ప్రవర్తన నచ్చకపోవడంతో అతడ్ని వదిలించుకునేందుకు శ్రద్ధ గతంలోనే ప్రయత్నించిందని, అయితే అది సాధ్యపడలేదని ఇద్దరికీ సన్నిహితంగా ఉండే ఫ్రెండ్స్ చెప్పారు.