World’s Population: 800 కోట్లకు చేరుకున్న ప్రపంచ జనాభా.. అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవనున్న భారత్

ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని తాజాగా ఐక్యరాజ్య సమితి నివేదిక తేల్చింది. వచ్చే ఏడాదికల్లా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవనుంది ఇండియా.

World’s Population: 800 కోట్లకు చేరుకున్న ప్రపంచ జనాభా.. అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవనున్న భారత్

World’s Population: ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. వచ్చే ఏడాది భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవనుందని కూడా తాజా నివేదిక అంచనా వేసింది. ఐరాస-2022 జనాభా అంచనాలపై ఒక నివేదిక వెల్లడించింది.

Super Star Krishna Passed Away: కృష్ణ భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి.. కన్నీరు పెట్టుకున్న చిరంజీవి..

ప్రస్తుతం జనాభాను మానవాళికి ఒక చారిత్రక మైలురాయిగా ఐరాస అభివర్ణించింది. ఐరాస నివేదిక ప్రకారం.. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత అంచనా ప్రకారం దేశ జనాభా 141.2 కోట్ల జనాభా ఉంది. 2050 నాటికి దేశ జనాభా 170 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. మరో 15 ఏళ్లలో ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుకుంటుంది. 8 దేశాల నుంచే తదుపరి 100 కోట్ల జనాభా పెరుగుతుంది. అయితే, ఆ తర్వాత జనాభా పెరుగుదల మందగిస్తుంది. దీంతో 2080 వరకు కూడా 1,000 కోట్లకు చేరుకునే అవకాశం లేదు. వైద్యం, పోషణ, వ్యక్తిగత శుభ్రత సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గి ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది. సంతానోత్పత్తి తగ్గడం వల్ల ప్రపంచ జనాభా పెరుగుదల తగ్గుతోంది.

InSight lander: ‘ఇక నా పని అయిపోయింది’.. మార్స్‌ నుంచి సందేశం పంపిన ఇన్‌సైట్ ల్యాండర్

ప్రపంచ జనాభాలో సగం జనాభా 7 దేశాల్లోనే ఉంది. చైనా, భారత్, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్ దేశాల్లో అత్యధిక జనాభా ఉంది. కాంగో, ఈజిప్టు, ఇథియోపియా, భారత్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. 2050 నాటికి చైనా జనాభా 130 కోట్లకు తగ్గుతుంది. ఈ శతాబ్దం చివరికి 80 కోట్లకు తగ్గుతుంది. జనాభా పెరుగుదల వల్ల పేదరికం, ఆకలి, పోషకాహార లోపం, విద్య, వైద్య సేవలు వంటివి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటాయి.