Denise Richards: పార్కింగ్ విషయంలో గొడవ.. షూటింగ్ కోసం వెళ్లిన నటిపై కాల్పులు

పార్కింగ్ విషయంలో మొదలైన చిన్న గొడవలో హాలీవుడ్ నటిపై కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ ఘటన అమెరికా, లాస్ ఏంజిల్స్‌లో సోమవారం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Denise Richards: పార్కింగ్ విషయంలో గొడవ.. షూటింగ్ కోసం వెళ్లిన నటిపై కాల్పులు

Updated On : November 16, 2022 / 4:31 PM IST

Denise Richards: ట్రక్కు పార్కింగ్ విషయలో గొడవ తలెత్తడంతో హాలీవుడ్ నటి, ఆమె భర్తపై కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ ఘటన అమెరికా, లాస్ ఏంజిల్స్‌లో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రముఖ హాలీవుడ్ నటి డెనిస్ రిచర్డ్స్, తన భర్త ఆరోన్ ఫైపర్స్‌తో కలిసి ట్రక్కులో లాస్ ఏంజిల్స్‌లోని స్టూడియోకు షూటింగ్ కోసం వెళ్లారు.

Man Kills Girlfriend: ప్రియురాలి గొంతు కోసి చంపి.. మృతదేహంతో వీడియో పోస్ట్ చేసిన నిందితుడు

ఈ క్రమంలో స్టూడియో బయట పార్కింగ్ కోసం అటూఇటూ వెతికారు. ఈ క్రమంలో వారికి దగ్గర్లోనే కారులో ఉన్న ఒక వ్యక్తి అసహనానికి గురయ్యాడు. వారిపై అరుస్తూ, దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా, వారి ట్రక్కుకు తన కారును అడ్డుగా పెట్టాడు. అయితే, డెనిస్ కోపానికి లోనవ్వకుండా అతడి కారు ముందుగా వెళ్లేందుకు తన వాహనాన్ని పక్కకు తప్పించింది. అయినప్పటికీ, కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి వారి వాహనంపై కాల్పులు జరిపాడు. ట్రక్కులోని డెనిస్, ఆమె భర్తపై కూడా కాల్పులు జరిపాడు. అయితే, వారు అక్కడ్నుంచి స్టూడియోలోకి పారిపోయారు.

Cheapest Electric Car: దేశంలో చవకైన ఎలక్ట్రిక్ కారు విడుదల.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు.. ధర ఎంతంటే

డెనిస్ సెట్‌లోకి ఏడ్చుకుంటూ పరుగెత్తుకుంటూ వెళ్లింది. వెంటనే గమనించిన సెట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వారి వాహనంపై కాల్పులు జరిగి ఉండటాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో ఎవరికీ, ఎలాంటి గాయాలూ కాలేదు. డెనిస్.. ‘వైల్డ్ థింగ్స్, ట్విస్టెడ్’ వంటి మూవీస్, వెబ్ సిరీస్‌లలో నటించింది.