InSight lander: ‘ఇక నా పని అయిపోయింది’.. మార్స్‌ నుంచి సందేశం పంపిన ఇన్‌సైట్ ల్యాండర్

అంగారకుడిపై పరిశోధనల కోసం నాసా ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ ఇన్‌సైట్ ల్యాండర్ త్వరలోనే నిలిచిపోనుంది. ఈ విషయాన్ని ఇన్‌సైట్ ల్యాండర్ స్వయంగా వెల్లడించింది.

InSight lander: ‘ఇక నా పని అయిపోయింది’.. మార్స్‌ నుంచి సందేశం పంపిన ఇన్‌సైట్ ల్యాండర్

Updated On : November 15, 2022 / 3:29 PM IST

InSight lander: మార్స్ (అంగారకుడి)పై పరిశోధనలకు నాసా ప్రయోగించిన వ్యోమనౌక ఇన్‌సైట్ ల్యాండర్ త్వరలో ఆగిపోనుంది. ఈ విషయాన్ని ఇన్‌సైట్ ల్యాండర్ స్వయంగా వెల్లడించింది. 2018 నవంబర్‌లో ఇన్‌సైట్ ల్యాండర్‌ను నాసా ప్రయోగించింది.

Super Star Krishna Passed Away: కృష్ణ భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి.. కన్నీరు పెట్టుకున్న చిరంజీవి..

అంగారకుడిపై పరిశోధనలు, అన్వేషణ కోసం నాసా దీన్ని ప్రయోగించింది. అంగారక గ్రహానికి సంబంధించి అంతర్గత రాతి పొరలను పరిశోధించడానికి దీన్ని ప్రయోగించారు. అప్పటి నుంచి కీలకమైన సమాచారాన్ని అందించింది. అయితే, ప్రస్తుతం ఈ స్పేస్ క్రాఫ్ట్ తన పని ముగించుకోబోతుంది. ఈ విషయాన్ని ఇన్‌సైట్ ల్యాండర్ స్వయంగా వెల్లడించింది. ‘‘నా పని ఇక్కడ ముగింపు దశకు చేరుకుంది. నాకు శక్తినందించే సోలార్ ప్యానెల్స్‌పై దుమ్ము చేరుకోవడంతో పని చేసేందుకు కావాల్సిన ఎనర్జీ అందడం లేదు’’ అని ఇన్‌సైట్ ల్యాండర్ ప్రకటించింది. దీంతో పవర్ అందని కారణంగా ఏ క్షణమైనా ఇది పని చేయడం ఆగిపోవచ్చు. ఈ స్పేస్ క్రాఫ్ట్ అక్కడ అద్భుతంగా పనిచేసింది.

Super Star Krishna Passed Away: రేపు ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో కృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు

1,300కుపైగా మార్స్ కంపాలను గుర్తించింది. అలాగే వాటికి సంబంధించి 50కిపైగా స్పష్టమైన సంకేతాలను పంపింది. దాదాపు నాలుగేళ్లుగా ఇది పని చేస్తోంది. మరోవైపు సోలార్ ప్యానెళ్లపై డస్ట్ తొలగించేందుకు పరిశోధకులు ప్రయత్నించారు. కానీ, అది సాధ్యం కాలేదు. దీంతో సోలార్ ప్యానెళ్ల ద్వారా శక్తి అందకపోవడంతో ఇన్‌సైట్ ల్యాండర్ కాలగర్భంలో కలిసిపోనుంది.