Man Kills Girlfriend: ప్రియురాలి గొంతు కోసి చంపి.. మృతదేహంతో వీడియో పోస్ట్ చేసిన నిందితుడు

ప్రియురాలిని రిస్టార్ట్‌కు తీసుకెళ్లిన ఒక వ్యక్తి ఆమె గొంతు, చేయి కోసి హత్య చేశాడు. తర్వాత ఆ యువతి మృతదేహంతో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. సోషల్ మీడియా ఖాతాలో అప్‌లోడ్ చేశాడు.

Man Kills Girlfriend: ప్రియురాలి గొంతు కోసి చంపి.. మృతదేహంతో వీడియో పోస్ట్ చేసిన నిందితుడు

Updated On : November 16, 2022 / 3:36 PM IST

Man Kills Girlfriend: శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమె ప్రియుడు కిరాతకంగా హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దుర్మార్గుడు తన ప్రియురాలిని హత్య చేశాడు. తాజా ఘటన మధ్యప్రదేశ్, జబల్‌పూర్ జిల్లాలో జరిగింది. అభిజిత్ పాటిదార్, శిల్పా మిశ్రా అనే యువతి కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు.

Cheapest Electric Car: దేశంలో చవకైన ఎలక్ట్రిక్ కారు విడుదల.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు.. ధర ఎంతంటే

ఈ క్రమంలో ఈ నెల 6న శిల్పా మిశ్రాను అభిజిత్.. జబల్‌పూర్ జిల్లా, కుందం ప్రాంతంలోని మేఖ్లా రిసార్ట్‌కు తీసుకెళ్లాడు. అనంతరం అదే రోజు రిసార్ట్ గదిలో మిశ్రా గొంతు, చేయి కోసి హత్య చేశాడు అభిజిత్. రిసార్టు గదిలో, బెడ్డుపైనే తీవ్ర రక్తస్రావంతో శిల్ప మరణించింది. అనంతరం ఆమె మృతదేహంతో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తర్వాత శిల్ప మృతదేహాన్ని గదిలోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో అప్‌లోడ్ చేశాడు. శిల్ప తనను మోసం చేసినందుకుగాను ఈ హత్య చేసినట్లు వీడియోలో చెప్పాడు. అవసరమైతే తనను పట్టుకోమంటూ పోలీసులకు సవాల్ విసిరాడు.

WhatsApp and Meta: వాట్సాప్, మెటా సంస్థల కీలక ఉద్యోగులు రాజీనామా.. ఇద్దరూ భారతీయులే

రెండు రోజుల తర్వాత అంటే నవంబర్ 8 వరకు గదిలోంచి ఎవరూ బయటకు రాకపోవడం, లోపలి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో అనుమానం వచ్చిన రిసార్ట్ సిబ్బంది ప్రత్యేక కీ ద్వారా గది తలుపులు తెరిచి చూశారు. లోపల వారికి శిల్ప మృతదేహం కనిపించింది. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం అభిజిత్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.