2026 Hyundai Venue EV : స్పోర్టీ డిజైన్, సేఫ్టీ ఫీచర్లతో 2026 హ్యుందాయ్ వెన్యూ ఈవీ కారు వస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 450 కి.మీ రేంజ్..!
2026 Hyundai Venue EV : ఎలక్ట్రిక్ కారు కొనేవారికి గుడ్ న్యూస్.. స్పోర్టీ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లతో 2026 హ్యుందాయ్ వెన్యూ ఈవీ కారు రాబోతుంది.

2026 Hyundai Venue EV
2026 Hyundai Venue EV : కొత్త ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో సబ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. హ్యుందాయ్ (2026 Hyundai Venue EV) వెన్యూ ఎలక్ట్రిక్ హై పర్ఫార్మెన్స్, అదిరిపోయే ఫీచర్లతో రానుంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ SUV అతి త్వరలో లాంచ్ కానుంది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లను మాత్రమే కలిగి ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా రాబోతుంది. హ్యుందాయ్ వెన్యూ ఎలక్ట్రిక్ 2026 గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డిస్‌ప్లే (అంచనా) :
పర్ఫార్మెన్స్, బ్యాటరీ ఆప్షన్ల విషయానికి వస్తే.. వెన్యూ ఈవీ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో రానుంది. షార్ట్ రేంజ్ కోసం ఫస్ట్ బ్యాటరీ ప్యాక్, బిగ్ రేంజ్ కోసం సెకండ్ బ్యాటరీ ప్యాక్ అందిస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో దాదాపు 450 కి.మీ రేంజ్ అంచనా. రాబోయే హ్యుందాయ్ వెన్యూ ఈవీ బ్యాటరీ ప్యాక్, రేంజ్ అధికారిక వివరాలను వెల్లడించలేదు.
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
హ్యుందాయ్ వెన్యూ ఎలక్ట్రిక్ బిగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో మల్టీ కార్-కనెక్ట్ సర్వీసులతో వస్తుందని భావిస్తున్నారు.
Read Also : Realme P4 5G Series : కొత్త రియల్‌మి P4 5G సిరీస్ ఆగయా.. ఒకటి కాదు రెండు ఫోన్లు.. ధర, ఆఫర్లు వివరాలివే!
డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్, ఎలక్ట్రానిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్, స్టీరింగ్ వీల్-మౌంటెడ్ కంట్రోల్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, హై-క్వాలిటీ లెదర్ అప్హోల్స్టరీ సీట్లు, కొత్త డిజైన్ డాష్‌బోర్డ్ లేఅవుట్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
2026 Hyundai Venue EV : సెక్యూరిటీ ఫీచర్లు :
సెక్యూరిటీ ఫీచర్లలో అడ్వాన్స్ లెవల్ అడాస్ టెక్నాలజీ ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, లేన్ డిపార్చర్ వార్నింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, డ్రైవర్ అటెన్షన్ అలర్ట్ అందిస్తుంది.
ఇతర సెక్యూరిటీ ఫీచర్లలో మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఈబీడీతో ఏబీఎస్, 360-డిగ్రీ కెమెరా, కెమెరాతో రివర్స్ పార్కింగ్ సెన్సార్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ యాంకర్ ఉన్నాయి.
ధర (అంచనా) :
2026 హ్యుందాయ్ వెన్యూ ఈవీ కారు రాబోతుంది. భారత మార్కెట్లో ధర దాదాపు రూ. 10 లక్షల ఎక్స్-షోరూమ్‌తో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2026లో ఎప్పుడైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లాంచ్ టైమ్, తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.