Gujarat Tragedy: బ్రిడ్జి ఓపెన్ చేసి ఉండకూడదు.. మోర్బి బ్రిడ్జి ఘటనపై కోర్టులో అఫిడవిట్ సమర్పించిన అధికారులు
గుజరాత్, మోర్బి బ్రిడ్జి కూలిన ఘటనపై మోర్బి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. బ్రిడ్జి మరమ్మతుల కోసం కంపెనీ తమపై ఒత్తిడి తెచ్చిందని, అప్పుడే బ్రిడ్జి ఓపెన్ చేసి ఉండకూడదని అఫిడవిట్‌లో పేర్కొంది.

Gujarat Tragedy: గత నెల 30న గుజరాత్, మోర్బి బ్రిడ్జి కూలిన ఘటనలో 135 మంది వరకు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రస్తుతం గుజరాత్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై మోర్బి మున్సిపల్ కార్పొరేషన్ స్పందించింది. పూర్తిగా తనిఖీలు చేయకముందే, బ్రిడ్జిని పర్యాటకుల కోసం ఓపెన్ చేసి ఉండకూడదని అభిప్రాయపడింది.
Elon Musk: ట్విట్టర్‌కు త్వరలో కొత్త సీఈవో.. పదవికి గుడ్ బై చెప్పనున్న ఎలన్ మస్క్
ఈ మేరకు హైకోర్టులో మోర్బి మున్సిపల్ కార్పొరేషన్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ ప్రకారం.. బ్రిడ్జి ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే, దీనికి మరమ్మతులు చేయాలని అధికారులు భావించారు. దీంతో ఈ కాంట్రాక్టు తమకే వచ్చేలా ఒవేరా గ్రూప్ కంపెనీ.. అధికారులపై ఒత్తిడి తెచ్చింది. బ్రిడ్జి ప్రమాదకర స్థితిలో ఉందని, దీనికి మరమ్మతులు చేసే కాంట్రాక్టు త్వరగా ఇవ్వాలని కంపెనీ బలవంతపెట్టింది. దీంతో టెండర్లు లేకుండానే మున్సిపల్ అధికారులు ఒవెరా కంపెనీకి బ్రిడ్జి మరమ్మతులు, నిర్వహణ కాంట్రాక్టు ఇచ్చారు. ఈ కాంట్రాక్టు తీసుకున్న సంస్థ సరైన మరమ్మతులు చేపట్టలేదు. తుప్పుపట్టి, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న కేబుళ్లను మార్చలేదు.
David Warner: రష్మిక మందన్నాకు సారీ చెప్పిన డేవిడ్ వార్నర్.. వైరల్ అవుతున్న ఆ వీడియో వల్లే
కానీ, ఫ్లోరింగ్ మాత్రం చేపట్టింది. అది కూడా బరువైన ఫ్లోరింగ్ ఏర్పాటు చేసింది. అటు ఫ్లోరింగ్ బరువు పెరిగిపోయి, ఇటు కేబుళ్లు సరిగ్గా లేకపోవడంతో బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో 135 మందికి పైగా మరణించారు. సరైన తనిఖీలు చేపట్టకుండానే అధికారులు బ్రిడ్జి తెరిచేందుకు అనుమతించారు. బ్రిడ్జిని అప్పుడే ఓపెన్ చేసి ఉండాల్సింది కాదని అధికారులు తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బ్రిడ్జి మరమ్మతుల కోసం కంపెనీ పొందిన కాంట్రాక్టు విలువ రూ.7 కోట్లు. ఈ కేసులో కంపెనీ నిర్లక్ష్యానికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.