Warangal: విద్యార్థినుల మధ్య ఘర్షణ.. మనస్తాపంతో బాలికల ఆత్మహత్యాయత్నం

బర్త్ డే పార్టీ విషయంలో పదో తరగతి విద్యార్థినుల మధ్య గొడవ తలెత్తింది. దీంతో మనస్తాపానికి గురైన బాలికలు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా, ఆరెపల్లిలో జరిగింది.

Warangal: విద్యార్థినుల మధ్య ఘర్షణ.. మనస్తాపంతో బాలికల ఆత్మహత్యాయత్నం

Updated On : November 20, 2022 / 3:45 PM IST

Warangal: వరంగల్ జిల్లా, ఆరెపల్లిలోని ఒక రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన పదో తరగతి బాలికలు ఆత్మహత్యాయత్నం చేశారు. హాస్టల్‌లో జరిగిన బర్త్ డే పార్టీ విషయంలో గొడవ తలెత్తడంతో మనస్థాపానికి గురై, ఐదుగురు విద్యార్థినిలు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

Arvind Kejriwal: ఉచిత విద్యుత్ అడ్డుకునేందుకు బీజేపీ యత్నం.. అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణ

దీంతో విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, స్పందించిన హాస్టల్ సిబ్బంది వెంటనే వారిని వరంగంల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. బాలికల హాస్టల్‌లో ఒక విద్యార్థిని బర్త్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు హాస్టల్ విద్యార్థులు కాకుండా, బయటివాళ్లు ఎక్కువగా హాజరు కావడంపై హాస్టల్ అధికారులు విద్యార్థినులను మందలించారు. దీంతో ఈ అంశంపై విద్యార్థినుల మధ్య గొడవ జరిగింది.

దీంతో ఆవేదనకు గురైన బాలికలు హాస్టల్‌లో ఉండే ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి బాగానే ఉందని ప్రిన్సిపల్ తెలిపారు.