Home » Author »Narender Thiru
ఉత్తర ప్రదేశ్, మెయిన్‌పురి లోక్ సభ స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నికలో అఖిలేష్ యాదవ్ సతీమణి, దివంగత ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎంపీగా ఉన్న యులాయం సింగ్ యాదవ్ మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది.
ఆప్ నేతలపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో తనను, తన భార్యను ఢిల్లీ జైలులో అధికారులు వేధిస్తున్నారని సుకేష్ చంద్రశేఖరన్ ఢిల్లీ ఎల్జీకి లేఖ రాశాడు. తమను దేశంలోని వేరే ఏ జైలుకైనా తరలించాలని పేర్కొన్నాడు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్జేడీ అధినేత లాలా ప్రసాద్ యాదవ్‌కు ఆయన కుమార్తె కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చింది. లాలూ రెండో కుమార్తె రోహిణి కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైంది. లాలూ ప్రసాద్ యాదవ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నార
మాజీ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్ రావు గురువారం తన కార్యకర్తలు, అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆయన తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. అరబిందో సంస్థకు చెందిన పెన్నాక శరత్ చంద్రారెడ్డితోపాటు, మరో మద్యం వ్యాపారి వినోద్ బాబును ఈడీ అరెస్టు చేసింది. వీరిని ఈ రోజు ఢిల్లీ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం ఇండియా - ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఇండియా గెలిచి ఫైనల్ చేరాలని... అక్కడ పాకిస్తాన్‌ను ఓడించి కప్పు సాధించాలని మన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పటికే విడాకులు తీసుకుందా? షోయబ్ మాలిక్‌తో ఆమె విడిపోయారా? ఈ విషయంలో వాళ్లిద్దరి సన్నిహితులు స్పందించారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జైలు నుంచి విడుదలయ్యారు. మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులో అరెస్టైన ఆయనకు బుధవారం ముంబైలోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయన 50వ సీజేఐ కాబోతుండటం విశేషం. ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగిన జస్టిస్ యూయూ లలిత్ రిటైరైన సంగతి తెలిసిందే.
ఇండియాకు ప్రతిష్టాత్మకంగా నిలవనున్న ‘జీ20’ సదస్సు లోగోను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మంగళవారం సాయత్రం ఆయన లోగోతోపాటు, థీమ్, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఈ సదస్సు జరుగుతుంది.
ప్రముఖ సంస్థ ‘ఫోర్బ్స్’ ప్రకటించిన ఆసియా శక్తివంతమైన మహిళల జాబితా-2022లో ముగ్గురు భారతీయులకు చోటు దక్కింది. ఘాజల్ అలాగ్, సోమా మోండల్, నమితా థాపర్ అనే వ్యాపారవేత్తలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
బీజేపీ సూచనలకు అనుగుణంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ దాడులు చేస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం. మోర్బి బ్రిడ్జి ప్రమాద ఘటనపై గుజరాత్ ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
ఆర్ఎస్ఎస్ నేత హత్య కేసు విచారిస్తున్న అధికారిని చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. కేరళలో గత ఏప్రిల్‌లో ఆర్ఎస్ఎస్ నేత హత్యకు గురైన సంగతి తెలిసిందే.
భారత టెన్నిస్ మాజీ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకోబోతుందా? పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు ఆమె దూరం కాబోతుందా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. పాక్ మీడియా కూడా దీనిపై పలు కథనాలు ప్రచురిస్తోంది. ఇంతకీ ీ ప్రచారం ఎందుకు మొదలైంది?
చిరుతను చూస్తే ఏ సాధారణ జంతువైనా భయపడిపోతుంది. అందులోనూ వీధి కుక్కైతే వెంటనే భయపడుతుంది. కానీ, ఒక కుక్క మాత్రం చిరుతనే ఎదిరించింది. తనపైకి దాడికి వచ్చిన చిరుతను కుక్క బెదరగొట్టింది.
హైదరాబాద్ సిటీలో ఫార్ములా ఈ-రేసింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. వచ్చే ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ కార్ల మోటార్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.
ఓఎంసీ కేసులో కొంతకాలంగా అనేక అభియోగాలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది.
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చేతిలో ప్రస్తుతం ఐదు కంపెనీలున్నాయి. దీంతో వాటి నిర్వహణా బాధ్యతలు చూసేందుకు ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తోంది. ఇప్పుడు తాను వారానికి 120 గంటలు పని చేస్తున్నట్లు ఎలన్ మస్క్ వెల్లడించాడు.
దేశంలో ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ నెల 4 నుంచి డిసెంబర్ 14 వరకు ఈ సీజన్ కొనసాగుతుంది. ఈ 41 రోజుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 32 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా.
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా ఒక వీడియోకు బ్యాగ్రౌండ్లో ‘కేజీఎఫ్-2’ మ్యూజిక్ వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. దీనిపై ఆ చిత్ర మ్యూజిక్ హక్కులు పొందిన ఆడియో సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది.