32 Lakh Weddings: మొదలైన పెళ్లిళ్ల సీజన్.. 41 రోజుల్లో 32 లక్షల పెళ్లిళ్లు.. 3.75 లక్షల కోట్ల వ్యాపారం!
దేశంలో ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ నెల 4 నుంచి డిసెంబర్ 14 వరకు ఈ సీజన్ కొనసాగుతుంది. ఈ 41 రోజుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 32 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా.

32 Lakh Weddings: దేశంలో మళ్లీ పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ నెల 4 నుంచి డిసెంబర్ 14 వరకు పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఈ సీజన్‌లో 32 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా ప్రకారం.. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు దేశవ్యాప్తంగా 32 లక్షల పెళ్లిళ్లు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఏడాది పెళ్లిళ్లపై ఆధారపడిన వ్యాపారం కనీసం 200 శాతం పెరిగే అవకాశం ఉంది. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా వెడ్డింగ్ ఇండస్ట్రీ ఇబ్బందులకు లోనైంది. అయితే, ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో పరిశ్రమ పుంజుకునే అవకాశాలున్నాయి. భారీ సంఖ్యలో వివాహాలు జరగబోతున్నాయని సీఏఐటీ అంచనా. ఒక్క ఢిల్లీ పరిధిలోనే కనీసం 3.5 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయి. దీని ద్వారా రూ.75,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అలాగే రాజస్థాన్‌లో 1.5 లక్షల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే సీజన్‌లో మాత్రం 25 లక్షల పెళ్లిళ్లు జరిగాయి.
Kerala Muslim Women: ఇరాన్ మహిళలకు సంఘీభావం.. హిజాబ్ దహనం చేసిన కేరళ మహిళలు
వీటి ద్వారా రూ.3 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. మొత్తంగా ఈ సీజన్‌లో 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని వివాహ అనుబంధ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 14 తర్వాత పెళ్లిళ్ల సీజన్ ముగుస్తుంది. ఇక వచ్చే ఏడాది జనవరి 14 నుంచి జూలై వరకు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుంది.