Kerala Muslim Women: ఇరాన్ మహిళలకు సంఘీభావం.. హిజాబ్ దహనం చేసిన కేరళ మహిళలు

హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అనేక దేశాల్లో ఇరాన్ మహిళలకు సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా కేరళలోనూ ఈ తరహా ఉద్యమం మొదలైంది.

Kerala Muslim Women: ఇరాన్ మహిళలకు సంఘీభావం.. హిజాబ్ దహనం చేసిన కేరళ మహిళలు

Kerala Muslim Women: ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా అక్కడి ముస్లిం మహిళలు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. హిజాబ్ ధరించే విషయంలో అనుసరిస్తున్న కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా మహిళలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు.

Lunar Eclipse: రేపే చంద్ర గ్రహణం.. ఏయే నగరాల్లో చూడొచ్చు.. హైదరాబాద్‌లో ఉంటుందా?

ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. వీధుల్లో ఉద్యమిస్తున్నవారిపై కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో వందలాది మంది మరణించారు. చనిపోయిన వారిలో కొందరు మగవాళ్లు కూడా ఉన్నారు. వేలాది మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది. అయితే, హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఇరాన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో మహిళలు సంఘీభావం తెలుపుతున్నారు. యూరప్, అమెరికాతోపాటు పలు దేశాల్లో ముస్లిం మహిళలు తమ హిజాబ్ తగలబెడుతూ, జుట్టు కత్తిరించుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేరళలోనూ ఈ తరహా ఉద్యమం ఊపందుకుంది. హిజాబ్ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న ఇరాన్ మహిళలకు సంఘీభావంగా కేరళలో కొందరు ముస్లిం అమ్మాయిులు తమ హిజాబ్ తగులబెట్టారు.

Cheetahs: వేట మొదలైంది.. మొదటిసారి జింకను వేటాడిన చీతాలు.. ప్రధాని హర్షం

కోరికోడ్ జిల్లాకు చెందిన ‘కేరళ యుక్తివాది సంఘం’ ఆధ్వర్యంలో ఆదివారం ‘ఫానోస్- సైన్స్ అండ్ ఫ్రీ థింకింగ్’ అనే పేరుతో ఒక సదస్సు జరిగింది. సదస్సు అనంతరం ఈ సంఘానికి చెందిన ముస్లి మహిళలు హిజాబ్ దహనం చేశారు. ఇరాన్ మహిళలకు సంఘీభావం తెలిపారు. ఆరుగురు మహిళలు తమ హిజాబ్ దహనం చేశారు. అనేక దేశాల్లో ఈ తరహా ఉద్యమాలు చాలా రోజుల నుంచి జరుగుతుంటే.. దేశంలో మాత్రం ఇదే మొదటిసారి. ఇటీవల ఇరాన్‌లో హిజాబ్ సరిగ్గా ధరించని కారణంగా ఒక మహిళను భద్రతాదళాలు హింసించి చంపడంతో ఈ ఉద్యమం మొదలైంది.