Cheetahs: వేట మొదలైంది.. మొదటిసారి జింకను వేటాడిన చీతాలు.. ప్రధాని హర్షం

చీతాల వేట మొదలైంది. గత సెప్టెంబర్‌లో దేశంలోకి అడుగుపెట్టిన చీతాలు ఇప్పుడు తొలిసారిగా తమ వేట పూర్తి చేశాయి. ఆదివారం రాత్రి ఒక జింకను వేటాడినట్లు అధికారులు తెలిపారు.

Cheetahs: వేట మొదలైంది.. మొదటిసారి జింకను వేటాడిన చీతాలు.. ప్రధాని హర్షం

Cheetahs ఇటీవల నమీబియా నుంచి ఎనిమిది చీతాల్ని ఇండియా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గత సెప్టెంబర్‌లో, ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా వాటిని మధ్య ప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కులో వదిలిపెట్టారు. అయితే, ఇంతకాలం వాటిని ప్రత్యేక పర్యవేక్షణలో, క్వారంటైన్‌లో ఉంచారు.

Lunar Eclipse: రేపే చంద్ర గ్రహణం.. ఏయే నగరాల్లో చూడొచ్చు.. హైదరాబాద్‌లో ఉంటుందా?

అంటే ఆహారం, నీళ్లు వంటివి అధికారులే అందించి వాటిని నిరంతరం పరిశీలించారు. ఇవి ఇప్పుడు భారతీయ వాతావరణానికి అలవాటపడ్డాయని భావించిన అధికారులు రెండు చీతాలను పూర్తి స్వేచ్ఛగా అడవిలో వదిలేశారు. ఈ నెల 5, శుక్రవారం వీటిని అడవిలోకి వదిలేశారు. అయితే, అడవిలోకి వెళ్లిన 24 గంటల్లోనే తమ తొలి వేటను విజయవంతంగా పూర్తి చేశాయి. ఇవి ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుఝాము లోపు ఒక జింకను వేటాడాయి. ఇదే వాటి తొలి వేట కావడం గమనార్హం. అంటే అడవిలోకి వదిలిపెట్టిన తర్వాత సొంతంగా ఆహారాన్ని వేటాడి తిన్నాయి.

Supreme Court EWS Reservations : ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించిన సుప్రీంకోర్టు.. సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లు డిస్మిస్

ఇది వాటి మనుగడకు ఎంతో అవసరం. రెండు చీతాలు తమ తొలి వేటను విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కాగా, మిగతా చీతాల్ని కూడా వరుసగా అడవిలోకి వదిలేయబోతున్నారు. ఈ నెల 10న కొన్ని చీతాల్ని అడవిలోకి విడిచిపెడతారు.